లింగాలఘనపురం, జూన్ 9 : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు అన్నారు. మండలంలోని నెల్లుట్లలో గురువారం జరిగిన పల్లెప్రగతి సభలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు గ్రామంలోని వీధులను, అర్బన్‌పార్క్, నర్సరీని, వైకుంఠధామాన్ని, సెగ్రియేషన్ షెడ్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో పచ్చదనం-పరిశుభ్రత నెలకొంటే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందన్నారు. పల్లె ప్రకృతివనాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయన్నారు. నెల్లుట్లలో చేపట్టిన అభివృద్ధి పనులు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అర్బన్ పార్కు అబ్బుర పరుస్తున్నదన్నారు. నేను సైతం మరో పర్యాయం ఈ పార్కును తప్పక సందర్శిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్ల స్వరూపారాణి, ఉప సర్పంచ్ ఎల్లస్వామి, డీఎల్పీవో పార్థసారథి, స్పెషలాఫీసర్ లత, తహసీల్దార్ అంజయ్య, ఎంపీడీవో సీతారాంనాయుడు, ఎంపీవో మల్లికార్జున్, ఏఈలు మధు, బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కారోబార్ కృష్ణస్వామి, నాయకులు బర్ల అబ్బసాయిలు, నర్సింగ్ రామకృష్ణ, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో అధికారులతో కలిసి పర్యటించి పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెప్రగతితో గ్రామాల్లో సుందరీకరణ జరిగిందని, శుభ్రత పెరిగిందనిన్నారు. పరిశుభ్రతతో సీజనల్ వ్యాధులను అరికట్టగలిగామన్నారు. పంచాయతీల పర్యవేక్షణ పెరిగిన నేపథ్యంలో ప్రజలు బాధ్యతతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనంతరం ధర్మగడ్డ తండాలో జడ్పీటీసీ పల్లా భార్గవీరెడ్డి, ఎంపీపీ బస్వ సావిత్రి, సర్పంచ్ గుగులోత్ సునీత వీధులను ఊడ్చి, తడిపొడి చెత్తను ట్రాక్టర్లలో నింపి శ్రమదానం చేశారు. అనంతనం సింగరాజుపల్లిలో పర్యటించిన వీరు పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కత్తుల విజయ్‌కుమార్, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో రాజలింగం, సింగరాజుపల్లి సర్పంచ్ గోపాల్‌దాస్ మల్లేష్, ఉప సర్పంచ్ కొండా చినబుచ్చిరెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు సంపత్, అనిల్, ప్రత్యేకాధికారులు విద్యుత్‌శాఖ ఏఈ రాజవర్ధన్‌రెడ్డి, తహసీల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఉపేందర్ పాల్గొన్నారు.
బచ్చన్నపేటలో..
బచ్చన్నపేట : మండల కేంద్రంలో చేపట్టిన పల్లెప్రగతి పనులను మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్ బుధవారం పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, శ్మశానవాటిక, నర్సరీ, సెగ్రిగేషన్షెడ్ను ఆయన పరిశీలించారు. వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ఆయా ప్రదేశాల్లో నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడుగుంత నిర్మించుకోవాలన్నారు. ఇదిలా ఉండగా మండల ప్రత్యేకాధికారి వినోద్‌కుమార్, ఎంపీడీవో రఘురామకృష్ణ గ్రామాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులపై పర్యవేక్షించారు. ఆలింపూర్‌లో పంచాయతీ కార్యదర్శి రేవతిగౌడ్, ప్రత్యేకాధికారి రాజు ఇంటింటికీ వెళ్లి తడిపొడి చెత్త వేరు చేసి పంచాయతీ ట్రాక్టర్‌కు అందించాలని అవగాహన కల్పించారు. బసిరెడ్డిపల్లిలో తెలంగాణ క్రీడా ప్రాంగణం కోసం స్థలాన్ని పంచాయతీ కార్యదర్శి రూపా చైతన్య చదును చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఈలు సత్తయ్య, నాగేందర్, ఆర్డబ్ల్యూఎస్ అరుణ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాల స్వరూపమే మారిపోతున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్ అన్నారు.గురువారం మండలంలోని నారబోయినగూడెం, బీక్యానాయక్తండా, వావిలాల ,హట్యతండాలో ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వారు రహదారులను శుభ్రం చేశారు. నవీన్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. హరితహారంలో మొక్కలు నాటాలని ఆయన కోరారు. అనంతరం నారబోయినగూడెం, టీక్యతండా, హట్యతండాలో జడ్పీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు, ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, సర్పంచ్ బానోత్ మహేందర్‌నాయక్, టీఆర్ఎస్ మం డల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య తదితరులు పాల్లొన్నారు.
చిల్పూరులో..
చిల్పూరు : మండలంలోని వంగాలపల్లి, నష్కల్, దేశాయ్తండా, పల్లగుట్ట, కృష్ణాజీగూడెం,కొండపూర్ గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులను స్పెషల్ ఆఫీసర్ రామాచారి పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని శ్మశాన వాటికలు, పల్లెప్రకృతి వనాలను పర్యవేక్షించారు. సెగ్రిగ్రేషన్ షెడ్లో సంప్రదాయ ఎరువుల తయారీ, డంపింగ్ యార్డులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు క్రీడా ప్రాంగణాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు ఆరూరి ప్రణీత, కర్నెకంటి స్వప్న, బోట్టు మానస, పుట్ట అంజనీదేవి, లోడం రజిత, లక్ష్మీ, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్ విమల, ఏఈ సందీప్‌కుమార్, ఏఈవో నర్సిహుంలు, ఈసీ కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.