దామెర, ఏప్రిల్ 25: మలేరియా నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ కే కాంత్రికుమార్ అన్నారు. ఆదివారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ‘మలేరియా బాధితుల సంఖ్య సు న్నా అంకెకు చేరుకోవడం’ అంశంపై పీహెచ్సీ సి బ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జ్వర పీడితులకు ర్యాపిడ్ డ్రైగ్రొసిస్ పరీక్షలు చేయాలన్నారు. గ్రామాల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలన్నా రు. పీహెచ్సీ డాక్టర్ శీరిష, జిల్లా యూనిట్ అధికారి మాడిశెట్టి శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ సదానందం, శ్రీకాంత్, భాగ్యలక్ష్మి, శివకుమార్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మలేరియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
గీసుగొండ: మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రోగ్రాం అధికారి శ్రీధర్ పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలో ఆదివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరచూ చలిజ్వరం, తలనొప్పి ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రంలో మలేరియా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో మధుసూదన్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది సరిత, సునీత, వసంత, కృష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరిలో అవగాహన ర్యాలీ
పర్వతగిరి: మండల కేంద్రంలోని పీహెచ్సీ వైద్య బృందం ఆధ్వర్యంలో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖర్జీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, వైద్యుల సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది రజిత, ప్రమీల, శ్రీలత, సంపూర్ణ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.