Assistant professor| లింగాల గణపురం : ఈ సారి రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా మంది Assistant professor| ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అంటున్నారు. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో నేలపోగుల సర్పంచ్ బరిలో బీఆర్ఎస్ బలపరిచిన (అసిస్టెంట్ ప్రొఫెసర్) గుగ్గిళ్ళ నవీత పోటీ చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో నేలపాడు గ్రామం సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు.
ఈ నేపథ్యంలో జనగామ సీజేఐటీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గుగ్గిళ్ళ నవీత సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఎంటెక్ చేసిన గుగ్గిళ్ళ నవీత ప్రస్తుతం జనగామ సీజేఐటీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటిదాకా విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్టులు బోధించిన నవీత బీఆర్ఎస్ మద్దతుతో ఇక సర్పంచ్‌గా గెలిచి ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు.
Ilayaraja | ఇళయరాజా పాటల వివాదం.. రూ.50 లక్షలతో మైత్రీ మూవీస్ సెటిల్మెంట్.!
Sobhita Dhulipala | మొదటి వివాహ వార్షికోత్సవం.. స్పెషల్ వీడియో షేర్ చేసిన అక్కినేని కోడలు
Thudarum | మలయాళ బ్లాక్‌బస్టర్ ‘తుడరుమ్’ రీమేక్‌లో అజయ్ దేవగణ్ ?