MLA Palla Rajeshwar Reddy | బచ్చన్నపేట, జూన్ 28 : ఇటీవలే ప్రమాదవశాత్తు కింద పడి గాయపడిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శనివారం మండల బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకున్నారు.
ఎమ్మెల్యేను పరామర్శించిన వారిలో జనగామ జిల్లా రైతు బందు సమితి మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి, మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ శాఖ అధ్యక్షులు. మండల నాయకులు, pacs చైర్మన్ పులిగిల్లా పూర్ణచందర్, మాజీ వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి, వేముల సాగర్ గౌడ్ మాజీ సర్పంచులు నరెడ్ల బాల్ రెడ్డి, వడ్డేపల్లి మల్లారెడ్డి, ముసిని రాజు, మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, యూత్ అధ్యక్షులు వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గందమల్ల నరేందర్,కంసాని మహేందర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ కానుగంటి బాలచందర్, కర్నాల వేణుగోపాల్, బొమ్మేన సందీప్ గౌడ్, బోడిగం గోవర్ధన్ రెడ్డి, అట్లా సందీప్ రెడ్డి, కోయడి శ్రీనివాస్ గౌడ్, కపర్తి హరిప్రసాద్, దాసారాం శ్రీనివాస్, పారుపల్లి చంద్రమౌళి, పిడుగు మహేష్, బోడిగం శ్రీపాల్ రెడ్డి, సిద్ధారెడ్డి, గందమల్ల మహేష్,ముసిని శ్రీశైలం గౌడ్, రామాంజయులు తదితరులు పాల్గొన్నారు.