English Teacher | ప్రభుత్వ పాఠశాలలో టీచర్ వింతగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. టీచర్ ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థులు ఈ టీచర్ మాకొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తోంది. జనగణన సమయంలో ఇంగ్లీష్ టీచర్ విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసింది.
ఈ విషయంపై సర్పంచ్ రాజు సదరు ఇంగ్లీష్ టీచర్‌ను ప్రశ్నించగా.. పుస్తకాలు విసరడం, వెకిలిగా నవ్వడం, హెచ్ఎం కుర్చీలో కూర్చొవడం, పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఆమె ఇలా వింతగా ప్రవర్తించడానికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రభుత్వ పాఠశాలలో టీచర్ వింత ప్రవర్తన
టీచర్ మాకొద్దంటూ విద్యార్థుల నిరసన
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని ఓ హై స్కూల్లో విద్యార్థుల పట్ల వింతగా ప్రవర్తిస్తున్న ఇంగ్లీష్ టీచర్
జనగణన సమయంలో విద్యార్థినిని అనవసరపు ప్రశ్నలు వేసిన ఇంగ్లిష్ టీచర్
ఈ విషయంపై సర్పంచ్ రాజు ఆమెను… pic.twitter.com/1rsXBMM1dh
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026