నర్మెట్ట, మార్చి 07: మూడు ఎమ్మెల్సీ స్థానాలకు(MLC elections) గాను రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బిజెపి ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా నర్మెట్ట మండల కేంద్రంలో బిజెపి నర్మెట్ట మండల కన్వీనర్ సొక్కం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ సొక్కం అనిల్ కుమార్ జిల్లా కార్యదర్శి, ధరవత్ రాజు మాట్లాడుతూ…ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టబద్రులు భారతీయ జనతా పార్టీకి జై కొట్టి, అధికార కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం, సిట్టింగ్ స్థానాన్ని సైతం కోల్పోవడం ఆ పార్టీకి చెంపపెట్టన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల ఉపాధ్యక్షుడు చెవుల రాజు, కొన్నే రాజు, యువ మోర్చ జిల్లా అధికార ప్రతినిధి రాజబోయిన శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొల్లాం అవినాష్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు జంగిటి నాగేశ్వర్, యువ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి బైకాన్ రంజిత్, బూత్ అధ్యక్షులు పాతూరి నారాయణరెడ్డి, పెండ్లి శివ, శివరాత్రి రవి, వైద్యం సుధాకర్, గోరంతల వెంకటేష్, గూటం హరిబాబు, సురేష్, రామగుండం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.