హనుమకొండ, నవంబర్ 17 : హనుమకొండ జిల్లా అథ్లెటిక్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో కిట్స్ కాలేజీ క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అస్మిత అథ్లెటిక్స్లీగ్ పోటీల్లో 14, 16 సంవత్సరాలలోపు బాలికలకు 11 అంశాల్లో పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్, మెరిట్ సర్టిఫికెట్స్అందజేసినట్లు తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సారంగపాణి తెలిపారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, సూచనల ప్రకారం పోటీలు నిర్వహించినట్లు చెప్పారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తెలంగాణ అథ్లెటిక్స్అసోసియేషన్ చైర్మన్ వరద రాజేశ్వర్‌రావు, పోటీల నిర్వహణకు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అబ్జర్వర్ అండ్ ట్యాలెంట్ ఐడెంటిఫికేషన్‌గా కె.అశ్విని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిట్స్కాలేజీ ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సారంగపాణి, వైస్ ప్రెసిడెంట్ రమేశ్‌రెడ్డి, టీఏఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి, అసోసియేషన్ సభ్యులు సాంబమూర్తి, వాసుదేవరావు, రజినీకాంత్, మహేందర్, కిట్స్ పీడీ శ్రీనివాస్‌రెడ్డి, కోచ్‌లు శ్రీమన్నారాయణ, నాగరాజు, తిరుపతి, రంజిత్ వివిధ స్కూళ్ల నుంచి 20 మంది పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
