బ్యాంకర్లు ప్రజలకు అవగాహన కల్పించాలి
వ్యవసాయ సంబంధిత రుణాలు క్రమం తప్పకుండా ఇవ్వాలి
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
కృష్ణకాలనీ, అక్టోబర్ 29 : నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా బ్యాంకర్లు అవసరమై బ్యాంకు రుణాలు అందించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్లో డీసీసీ, డీఎల్ఆర్సీ బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, వ్యాపారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందిస్తున్న రుణాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం బ్యాంకర్లు, సంబంధిత అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రుణాలు పొందేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు బ్యాంకుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రుణాలు పొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. వ్యవసాయ సంబధిత రుణాలు పౌల్ట్రీ, డైరీ పథకాలతో రుణాలు, చిరు వ్యాపారులకు ముద్ర లోన్, నాబార్డ్ వంటి పథకాలపై కూడా రుణాలు అందిస్తుందని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలా ప్రతి పాదనలు చేయాలన్నారు. చెల్పూర్ ఎస్బీఐ బ్రాంచ్ జెన్కో లోపల ఉండడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆ బ్రాంచ్‌ను చెల్పూర్ మెయిన్ రోడ్డు పక్కకు మార్చి ఖాతా దారులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. అనంతరం నాబార్డ్‌కు సంబంధించి కర పత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎల్డీఎం శ్రీనివాస్, డీఆర్డీవో పురుషాత్తం తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గణపురం : మండలంలోని 27 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, ఆరుగురికి 2.54 లక్షల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. శుక్రవారం మండలంలోని ఎమ్మెలల్యే చెల్పూరు, ధర్మారావుపేట గ్రామాల్లో పర్యటించారు. కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇంటికీ వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకుని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనని చెప్తున్నదని, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీశ్‌కుమార్, ఆర్ఐ సాంబయ్య, వీఆర్వో శ్రీను, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోట్ల నగేశ్, సర్పంచులు నడిపెల్లి మధుసూదన్ రావు, తాళ్లపల్లి మంజులా భాస్కర్‌రావు, పోతుల ఆగమ్మ, ఐలోని శశిరేఖా రామచంద్రారెడ్డి, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనర్సింహారావు, మోతె కర్ణాకర్ రెడ్డి, ఉడత సాంబయ్య, ఇడబోయిన సంతోష్, మర్త సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.