మేయర్ గుండు సుధారాణి
29వ డివిజన్లో పర్యటన
ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమం ప్రారంభం
వరంగల్, ఆగస్టు 29: సీజనల్ వ్యాధుల నివారణకు బల్దియా ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల కార్యక్రమాన్ని తాను ప్రాతినిథ్యం వహిస్తున్న 29వ డివిజన్లో ప్రారంభించారు. డివిజన్లోని రామన్నపేట, ఓఎస్నగర్, కుంటిభద్రయ్య గుడి ప్రాంతాల్లో పర్యటించి, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు పది నిమిషాలపాటు తమ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రేటర్ పరిధిలోని 66 డివిజన్లలో నిల్వ నీటిని పారబోయాలని, దోమల లార్వా పెరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రానున్న పది వారాలపాటు వారానికి పది నిమిషాల చొప్పున ప్రజలు తమ గృహాలు, పరిసరాలపై దృష్టి సారిస్తే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంరాజ్, హెల్త్ అసిస్టెంట్ ఉదయ్‌కుమార్, జవాన్ సునీత, కల్పలత సూపర్‌బజార్ చైర్మన్ ఎండీ షఫీ, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్, రాచర్ల రాము, వాడిక నాగరాజు, శ్రీరాముల సురేశ్, తాళ్లపల్లి రమేశ్, లోకేశ్, గట్టు చందు, పూజారి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రత మనందరి భాధ్యత
కరీమాబాద్: పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని కార్పొరేటర్ గుండు చందన, మరుపల్ల రవి అన్నారు. వరంగల్ 42, 40వ డివిజన్లలో 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేశారు. ఈ సందర్భంగా గుండు చందన, మరుపల్ల రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలనికోరారు. డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గుండు పూర్ణచందర్, వరంగల్ మహానగరపాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.