పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
బచ్చన్నపేట, డిసెంబర్ 21: ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో శివ సూచించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లోని పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను, పంచాయతీలను, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ వైరస్ రాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య పద్ధ్దతులు పాటించాలని, కొవిడ్ టీకాలు వేసుకోవాలని సూచిం చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లోని వీధులు చెత్తచేదారం లేకుండా ప్రతిరోజూ శుభ్రం చేయాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి రేవతి, రాజశేఖర్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
దేవరుప్పుల: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో అలక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో ఉమామహేశ్వర్ సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పంచాయత్ కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు పూర్తి కాగా, వీధుల శుభ్రత, మరుగుకాల్వల నిర్వహణ జరుగుతున్నాయన్నారు. కాగా, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గ్రామాల్లో కేంద్ర బృందాలు ఆకస్మి తనిఖీలు చేసే అవకాశం ఉందని, అన్ని గ్రామాల్లో వీధులు, ఇండ్లు, పరిసరాలు, మురుగుకాల్వలు శుభ్రంగా ఉంచే ఏర్పాటు చేసుకోవాలని పంచాయత్ కార్యదర్శులకు సూచించారు. ఎలాంటి సమస్యలు తలెత్తినా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో కవికుమార్ ఉన్నారు.