India -France : భారత్, ఫ్రాన్స్ మధ్య దౌత్య సంబంధాల్లో కీలక అడుగు పడింది. రక్షణలో భాగస్వామ్యం, కృత్రిమ మేధస్సులో పరస్పర సహకారంతో కలిపి ఇరుదేశాల మధ్య మొత్తంగా 20కి పైగా ఒప్పందాలు కుదిరాయి. ముంబైలో మంగళవారం భేటీ సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మక్రాన్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఈ ఒప్పందాలు జరిగాయి. రఫెల్ యుద్ధ విమానాల నుంచి జలాంతర్గామిల వరకూ భారత్ – ఫ్రాన్స్ మధ్య సహకారం కొనసాగుతుందని మక్రాన్ వెల్లడించారు.
ఏఐ సమ్మిట్‌కు హాజరయ్యేందుకు భారత్‌కు విచ్చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, ప్రధాని నరేంద్ర మోడీతో కీలక భేటీలో పాల్గొన్నారు. భారత్ మాకు నమ్మకమైన భాగస్వామి అని పేర్కొన్న ఆయన కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ముంబైలో సమావేశమైన ఇద్దరు.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా రక్షణ, నైపుణ్యం, ఇంధనం, సాంకేతికతలో సహకారం, వాణిజ్యం, ఆరోగ్య రంగం.. వంటి 20కి పైగా అంశాల్లో పరస్పరం సహకారానికి, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇరువురు అంగీకరించారు. ఫ్రాన్స్ అధినేతతో భేటీ అనంతరం మోడీ ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు.
#WATCH | Mumbai: French President Emmanuel Macron says, “Whether it’s the Rafale, submarines, or the engines for fifth-generation fighter jets, there are many areas where we are working together with India. We believe in technology transfer, and we have tried to do the same, as… pic.twitter.com/6MB4mwBIgX
— ANI (@ANI) February 17, 2026
‘ప్రపంచం ఈ రోజు అనిశ్చితి దశలో సాగుతోంది. అలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ స్థిరత్వంలో భారత్ – ఫ్రాన్స్ భాగస్వామ్యం ఒక శక్తిగా మారనుంది. ఫ్రాన్స్, ఇండియా ఎప్పటినుంచో వ్యూహాత్మక భాగస్వాములుగా ఉంటున్నాయి. ఇరుదేశాలు తమ బంధానికి మరింత శక్తిని, ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. ఈ రెండు దేశాలు నమ్మకం, ముందుచూపుతో ప్రపంచంలో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయి. ఈ సందర్భంగా భారత్ – ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్‌ను ఆవిష్కరించడం ద్వారా ఇరుదేశాల వ్యూహాత్మక కలయికను ప్రజలతోనూ భాగస్వామ్యం చేస్తున్నాం. ఏ ఆవిష్కరణ అనేది విడివిడిగా ఉంటే సాధ్యపడదు. పరస్పర సహకారం ఉంటేనే ఇన్నోవేషన్స్ జరుగుతాయి’ అని మోడీ పేర్కొన్నారు.
భారత్ – ఫ్రాన్స్ సహకారంతో ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. డిజిటల్ సైన్స్, సాంకేతికత కేంద్రాన్ని.. ఏరోనాటిక్స్‌లో నైపుణ్యాలు పెంచడానికి జాతీయ కేంద్రాన్ని తెరుస్తామని మోడీ వెల్లడించారు. ఇరువురి భేటీ సందర్భంగా.. రక్షణలోనూ కీలక మందడుగు పడింది. ఎయిర్‌బస్, టాటా అధునాతన వ్యవస్థతో కలిసి హెచ్125 హెలిక్యాప్టర్లను తయారు చేస్తామని మోడీ, మక్రాన్ ప్రకటించారు. అంతేకాదు అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎత్తులో విహరించే హెలిక్యాప్టర్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు విక్రయిస్తామని ఇరువురు తెలిపారు.