గజమాలతో సత్కారం.. రెండు క్వింటాళ్ల భారీ కేక్‌కట్ చేయించిన అభిమానులు
హాజరైన ఎంపీ కవిత, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు
చిన్నగూడూరు, ఆగస్టు 20 : డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం మండలంలోని ఉగ్గంపల్లిలో ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి రెడ్యాకు పుష్పచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మానుకోట ఎంపీ మాలోత్ కవిత రెడ్యాను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తండ్రితో కలిసి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. రెడ్యా తనయుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర, రెడ్యా సతీమణి లక్ష్మి రెడ్యాకు కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, మరిపెడ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉగ్గంపల్లిలో రెడ్యాను గజమాలతో సత్కరించారు. టీఆర్ఎస్ డోర్నకల్ పట్టణ అధ్యక్షుడు కత్తెరశాల విద్యాసాగర్ తయారు చేయించిన రెండు క్వింటాళ్ల భారీ కేక్‌ను స్థానిక నాయకులతో రెడ్యా కట్ చేశారు. భారీగా తరలివచ్చిన అభిమానులు రెడ్యా ఇంటి ఆవరణలో పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు వల్లూరి పద్మావెంకటరెడ్డి, అరుణ, బాలూనాయక్, సుశీల, ఉమామల్లారెడ్డి, పద్మారవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట లాలయ్య, రాంసింగ్ , రమణ, వేణు, జడ్పీటీసీలు శారద, కమలారామనాథం, జడ్పీ వైస్ చైర్మ న్ వెంకటేశ్వర్‌రెడ్డి, మరిపెడ, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్లు సింధూరాకుమారి, వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలిం గం, చిన్నగూడూరు మండల నాయకులు వెంకటరెడ్డి, మురళీధర్‌రెడ్డి, ధారాసింగ్, చెన్నారెడ్డి, చెన్నయ్య, కొమురెల్లి, మల్లేశ్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్, వైస్ ఎం పీపీ వీరన్న, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ మంగపతిరావు, నాయకులు పిచ్చిరెడ్డి, ముండ్ల రవి, సంపెట రాము, మ హేందర్‌రెడ్డి, వెంకన్న, అచ్యుత్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, రాంబా బు,రవీందర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.