ఒకే చోట గురుకులాలు, జూనియర్ కశాశాలలు
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ విద్యాలయాలు
ఆధునిక హంగులు.. సకల సౌలత్లు
విద్యకు పెద్ద పీట వేస్తున్న టీఆర్ఎస్ సర్కారు
ఒకే చోట గురుకులాలు, జూనియర్ కళాశాలలు
కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ విద్యాలయాలు
ఆధునిక హంగులు.. సకల సౌలత్లు
విద్యకు పెద్ద పీట వేస్తున్న టీఆర్ఎస్ సర్కారు
కమలాపూర్, ఆగస్టు 20: తెలంగాణ వస్తే ఏమొస్తది? అని విమర్శించిన వారికి హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ గురుకుల విద్యాలయాలే సమాధానమిస్తున్నాయి. ఆధునిక వసతులు, సకల సౌకర్యాలతో ఇక్కడ నిర్మించిన ప్రభుత్వ విద్యాలయాలు కార్పొరేట్‌ను తలదన్నుతున్నాయి. సర్కారు విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారనేందుకు ఈ భవనాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీసీ గురుకులాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా కమలాపూర్-హనుమకొండ వెళ్లే మార్గంలో గూడూరు శివారులో కార్పొరే ట్ భవనాలను తలపించేలా మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర, బాలికల విద్యాలయాలను నిర్మించారు. విద్యార్థుల వసతి గృహం, తరగతులు నిర్వహిం చేందుకు ప్రత్యేక భవనం, వెయ్యి మంది విద్యార్థులు ఒకేసారి తినేందుకు డైనింగ్ హాల్, అధ్యాపకుల నివాస గృహాలను అధునాతన హంగులతో నిర్మించారు. ఎంజేపీ బాలుర విద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి రాగా, బాలికల విద్యాలయం పనులు చివరి దశకు చేరు కున్నాయి. ఎంజేపీలో ఆరు నుంచి పదోతరగతి, ఇంటర్ ఇంగ్లిష్ మీడి యం చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఒక్కో గురుకుల విద్యాలయ భవన నిర్మాణానికి రూ. 20 కోట్ల నిధులు కేటాయించింది.
ఎడ్యుకేషన్ హబ్
కమలాపూర్ నుంచి హనుమకొండకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ఒకే చోట మహాత్మా జ్యోతిబాపూలే బాలుర, బాలికల విద్యాలయాలు, మాడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు నిర్మించారు. దీంతో కమ లాపూర్ ఎడ్యుకేషన్ హబ్‌ను తలపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్య మైన విద్యను అందించేందుకు అన్ని వసతులతో కూడిన నూతన భవనాలు నిర్మించ డంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈటల చేసింది ఏమీ లేదు
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ నిధులను కేటాయిస్తే, తానే డబ్బులిచ్చిన ట్లు ఈటల చెప్పుకోవడం బాధాకరం. ఏడేండ్లు మంత్రిగా ఉన్న రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వమే నిధులు కేటాయించినట్లు చెప్పకపోవడం ఆయన అనైతికతకు నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ పాలనలో జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగడం తెలంగాణ ప్రజల అదృష్టం.
టీఆర్ఎస్ పాలనలోనే మార్పు
సీఎం కేసీఆర్ కార్పొరేట్ హంగులతో ప్రభుత్వ విద్యాలయ భవన నిర్మాణాలు నెలకొల్పడం అభినందనీయం. విద్యకు పెద్ద పీట వేశారని చెప్పేందుకు ఇవే నిదర్శనం. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు పైసా ఖర్చు లేకుండా చదువుకునేందుకు అవకాశం దక్కింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే విద్యలో మార్పు వచ్చింది అనేది ప్రజలు గుర్తించాలి.