జనగామ చౌరస్తా, ఆగస్టు 20 : శ్రావణ శుక్రవారం సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంతోషిమాత దేవాలయం, అమ్మబావి ఉప్పలమ్మ, పోచమ్మ గుడి, రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. తెల్లవారుజామున తలంటు స్నానం చేసి ఇళ్లముందు ముగ్గులు వేశారు. గడపలకు పసుపుకుంకుమ పూసి, మామిడి ఆకు తోరణాలతో ఇళ్లను అందంగా అలంకరించి లక్ష్మీదేవి, మంగళగౌరికి పూజలు చేశారు. తమ ఇంటి ఇలవేల్పుగా వరలక్ష్మి అమ్మవారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి వ్రతం ఆచరించారు. వరలక్ష్మి అష్టోత్తర శత నామావళి చదువుతూ పూలను శ్రీదేవికి అర్పించారు. ధూప, దీప నైవేద్యం కింద అమ్మ వారికి అత్యంత ప్రీతికరమైన పూర్ణం బూరెలు, రవ్వ అప్పాలు, పెసర పొంగలి సమర్పించారు. మొక్కులు చెల్లించిన అనంతరం వాయినాలు సమర్పించి అమ్మవారి దీవెనలు పొందారు. బాలాజీనగర్ ఎల్లమ్మ ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారి మాదాసు రాజేశ్ భార్గవ, దూడల శోభారాణి, లగిశెట్టి పద్మావతి, సంబోజు జ్యోతి, లోనె మంజుల, బొడ్డు లక్ష్మి, పోగుల కవిత, విజయ, సునీత, పావని, మమత పాల్గొన్నారు
జనగామరూరల్లో..
జనగామ రూరల్ : జనగామ మండలంలోని పలు గ్రా మాల్లో శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. పాడిపంటలు బాగుండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కొలిచారు. కొందరు బంగారు ఆభరణాలు, ధాన్యం సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఆడపడుచు లు వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.
రఘునాథపల్లిలో..
రఘునాథపల్లి : మండల కేంద్రంలోని శ్రీ మహాదేవస్వామి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చనతోపా టు అమ్మవారికి ఒడి బియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించి మొక్కు లు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పిండిప్రోలు శ్రీనివాస్‌శర్మ, లక్ష్మీనర్సింహాచార్యులతోపాటు భక్తు లు కూరెళ్లి ఉపేందర్, రేణుక, కొన్నె రమ, ఆకుల జ్యోతి సుజాత, రాధ, రేఖ, లత, స్వప్న పాల్గొన్నారు.
నర్మెటలో..
నర్మెట : శ్రావణమాస శుక్రవారం సందర్భంగా మం డలంలోని ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి అమ్మవారికి అర్చనలు నిర్వహించారు. సాయిబాబా ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్ : మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవాలయాల్లో సామూహిక పూజలు చేశారు. శావ్రణ శుక్రవారం సందర్భంగా ఉద యం నుంచే మహిళలు ఆలయాలను దర్శించుకున్నారు. ఇళ్లవద్ద నిర్వహించిన వ్రతా ల్లో అమ్మవారికి ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు, పసుపు, కుంకుమ, గాజు లు సమర్పించారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి : మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఓంకారేశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. అర్చకులు దేవగిరి రామన్న, గంగు రఘు ఆధ్వర్యంలో పూజలు చేశారు. మరోవైపు శ్రావణ శుక్రవారం నేపథ్యంలో క్షీరగిరి క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహేశ్వరుడికి అర్చనలు ,అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పక్కనే ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మొక్కులు చెల్లించారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : మండల కేంద్రంలోని మహాశివుడి ఆలయంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. నాగదక్షిణశర్మమూర్తి ఆధ్వర్యంలో కొనసాగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాడిపంటలు బాగుండాలని అమ్మ వారికి మొక్కులు చెల్లించారు. మరోవైపు పలు గ్రామాల్లో మంగళగౌరికి పూజలు చేశారు.