జిల్లాలో అంబరాన్నంటిన మొహర్రం వేడుకలు
గ్రామాల్లో పీరీల ఊరేగింపు
విచిత్రవేషధారణలతో అలరించిన భక్తులు
జనగామ రూరల్/లింగాలఘనపురం/ రఘునాథపల్లి/ నర్మెట/దేవరుప్పుల/ పాలకుర్తి/బచ్చన్నపేట/జఫర్‌గఢ్/ కొడకండ్ల, ఆగస్టు 20 : మొహ ర్రం సందర్భంగా శుక్రవారం జిల్లాలో పీరీల సందడి నెలకొంది. ఆయా గ్రామా ల్లో సవార్ల ఊరేగింపు నిర్వహించారు. మతసామ రస్యా నికి ప్రతీకైన పీరీల వేడుకలను కులమతాలకు అతీతంగా ప్రజలు ఘనంగా జ రుపుకున్నారు. పది రోజులు గా పల్లెలు, తండాల్లో పీరీల పండుగ నిర్వహిస్తున్నా రు. ఈ సందర్భంగా చావడి వద్ద భక్తులు అల్వా చూట్టూ తిరుగుతూ పాటలు పాడి సందడి చేశారు. జనగామ మండలంలోని పలు గ్రామాల్లో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. లింగాలఘనపురంలో పలువురు భక్తులు విచిత్ర వేషధారణలతో అలరించారు. ఈ వేడుకల్లో ఏదునూరివీరన్న, ఎడ్ల మల్లేశం, ఎడ్ల సోమయ్య, లింగాల ప్రభాకర్, మహేశ్వరం సూర్యనారాయణ, లింగాల దుర్గ య్య, ఏదునూరి యాదగిరి పాల్గొన్నారు. రఘునాథపల్లి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో భక్తులు పీరీలను ఊరేగించి నిమజ్జనం చేశారు. మొహర్రం సందర్భంగా పది రోజులు భక్తిశ్రద్ధలతో పీరీలను ఊరేగించి కానుకలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎండీ యూసఫ్, బండి సతీశ్, మధు, బండి వేణుగౌడ్, నర్ర అనిల్, అవదూత శంకర్, నర్ర సంపత్, సాంబయ్య, రాజబాబు, వరిగె రాజు పాల్గొన్నారు. నర్మెట మండల కేంద్రంలో పలువురు వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా పీరీలకు భక్తులు కుడుకలు, బెల్లం సమర్పించారు. దేవరుప్పుల మండలం సీతారాంపురంలో ఎంపీపీ బస్వ సావిత్రి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పీరీల పండుగ సందర్భంగా సవార్లకు మొక్కలు చెల్లిస్తామన్నారు. మరోవైపు సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్, మాజీ సర్పంచ్ బస్వ మల్లేశ్ తల్లిపీరి పల్లకిని గ్రామంలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యాకూబ్‌పాషా, పాషా, ముజవర్లు అఫ్జల్, మౌలానా, రుద్రోజు వీరాచారి, బోనాల కొండయ్య, తాడం యాకన్న పాల్గొన్నారు. మరోవైపు మొహర్రం సందర్భంగా జఫర్‌గఢ్‌లోని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కూనూరులో షేక్ షాహీద్ హుస్సేన్ ఆధ్వర్యంలో పీరీలతో ఊరేగింపు నిర్వహించారు. తమ్మడపల్లి(జీ)లో అహ్మదీయ యూత్ ఆధ్వర్యంలో ప్రార్ధనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎండీ నజీర్, అజీమ్, ముజీబ్, యాకూబ్, రసూల్ ఇమామ్, పాషా, అజీజ్ పాల్గొన్నారు.
అలరించిన శూర్పనక వేషధారణ
పాలకుర్తి మండలంలో మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రానికి చెందిన బండి కొండయ్య శూర్పనఖ వేషధారణతో ప్రదర్శన ఇచ్చారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన ఇస్తున్న ప్రదర్శన స్థానికులను ఆకట్టుకుంటున్నది. మరోవైపు పలువురు భక్తులు వివిధ వేషధారణలతో వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో బండి రాజు, కమ్మగాని శ్రావణ్ కుమార్, బండి కిరణ్, జీడి సమ్మయ్య, దాసరి మధు, మాశూక్, బండి యాకయ్య, కమ్మగాని సుధాకర్ పాల్గొన్నారు. మండలంఓ శుక్ర వారం ఉదయాన్నే ఆల్వాను పూడ్చి. గొర్రె, మేకను బలి చ్చారు. సాయంత్రం పీరీలను ఊరేగించారు. ఈ సంద ర్భంగా ఊదు బెల్లం, కుడుకలు సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు.