పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19 : అయ్యప్ప శరణుఘోషతో పాలకుర్తి మార్మోగింది. అయ్యప్ప భక్తుల భజనతో పురవీధులు పులకించాయి. డోలు వాయిద్యాలు, అయ్యప్ప స్వాముల నృత్యాల నడుమ మణికంఠుడి పంబారట్టు(జలక్రీడ) కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక రథంలో ఊరేగించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయన సతీమణి ఉషా దయాకర్రావు ఉత్సవమూర్తిని తలపై మో స్తూ ఊర చెరువు వరకు కాలినడకన తీసుకొచ్చారు. అనంతరం గురుస్వాములు, ప్రధాన అర్చకుడు దేవగిరి రామన్న శర్మ, బజ్జూరి వేణుగోపాల్, ఇమ్మడి ప్రకాశ్, చారగొండ్ల శివ, దేవగిరి సునీల్, పోగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు చేశారు. ఊర చెరువులో అయ్యప్పస్వామికి అభిషేకం చేసి జలక్రీడ నిర్వహించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ భక్తి భావంతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, రైతు బంధుసమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, జరుపుల బాలునాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, దేవగిరి భీమన్న, చె న్నూరు సోమనర్సయ్య, మేడారపు సుధాకర్, గజ్జి సంతోష్, రాపర్తి ఆంజనేయులు, పసుల వెంకటేశ్, గబ్బెట సోమనారాయణ, ముస్కు చంద్రబాబు. నంగు నూరి మహేశ్, మామిండ్ల కిరణ్, సంతోష్ పాల్గొన్నారు.