నర్మెట, అక్టోబర్ 16: అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడూతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారని వివరించారు. అన్నదాతల కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయం చేస్తున్నారని ఆయన తెపారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో తెలంగాణలో ప్రతీ ఎకరానికి సాగునీరు అందేలా ప్రణాళికలు తయారుచేశారని అన్నారు. రాబోయే తరాలకు కరువు లేకుండా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి జనగామ నియోజకవర్గానికి రూ.500 కోట్లతో కాల్వల నిర్మాణానికి చర్యలు తీసుకున్నందుకు నియోజకర్గ ప్రజల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, వైస్ ఎంపీపీ మంకెన ఆగిరెడ్డి, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు వంగ ప్రణీత్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కంతి రాజలింగం, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ఆమెడపు కమలాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి, మండల అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.