వర్ధన్నపేట, ఆగస్టు 14: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన రాజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే రమేశ్ సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి లక్ష రూపాయలు మంజూరయ్యాయి. ఈ మేరకు శనివారం బాధితుడికి అరూరి ఎల్వోసీని అందజేసి మాట్లాడారు. లక్షలాది రూపాయల ఖరీదైన వైద్యం చేయించుకోలేక నిరుపేదలు అవస్థలు పడుతున్నారన్నారు. వారి ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నారని కొనియాడారు. నియోజకవర్గంలో ఇప్పటికే వందల సంఖ్యలో బాధితులకు సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా పేదలకు సహకారం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, ఎల్వోసీ అందించిన అరూరికి రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.