మేయర్ గుండు సుధారాణి
నగరంలో పారిశుధ్య పనుల పరిశీలన
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 12: నగరంలో పారిశుధ్య పనుల నిర్వహణ పటిష్టంగా జరుగాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. నర్సంపేట రోడ్డులోని గోపాలస్వామిగుడి, పోచమ్మమైదాన్, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆదివారం ఆమె పారిశుధ్య పనుల తీరును ఆకస్మికంగా తనిఖీ చేశారు. రహదారుల క్లీనింగ్తోపాటు సిబ్బందికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రోడ్ల వెంట ఉన్న బిన్లలోని చెత్త, డ్రైనేజీల్లోని చెత్తాచెదారాన్ని క్రమంతప్పకుండా తొలగించాలని మేయర్ సూచించారు. రోడ్లపై చెత్తకుప్పలు లేకుండా చూడాలన్నారు. అలాగే, రహదారులను శుభ్రం చేస్తున్న స్వీపింగ్ యంత్రం పనితీరును పరిశీలించారు. సుధారాణి వెంట శానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, ఎస్ఐలు, జవాన్లు ఉన్నారు.
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
గీసుగొండ: పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధులు దరిచేరవని మేయర్ సుధారాణి అన్నారు. 16వ డివిజన్లోని ధర్మారంలో బల్దియా ఆధ్వర్యంలో చేపట్టిన యాంటీ లార్వా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఇండ్లతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి మనీషా, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ బొల్లం రాజయ్య, మార్కెట్ డైరెక్టర్ గోలి రాజయ్య, నాయకులు శివకుమార్, కృష్ణ, రాజు, బాబు, రాజు, యుగేంధర్, మల్లేశం పాల్గొన్నారు.
గణనాథుడికి మేయర్ పూజలు..
ఖిలావరంగల్/మట్టెవాడ: ఆధ్యాత్మిక చింతన, ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని మేయర్ సుధారాణి అన్నారు. ఖిలావరంగల్ పడమరకోట పద్మశాలివీధిలోని గణపతి మండపంలో ఆమె పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్, దుస్సా భాస్కర్, ఇనుముల మల్లేశం, గజ్జెల శ్యామ్, మిట్టపెల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలాగే, 29వ డివిజన్ రామన్నపేటలో న్యూ చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం చేయగా, సుధారాణి ముఖ్య అతిథిగా హాజరై గణనాథుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో మధిరగాని రమేశ్-జయలక్ష్మి, శ్రీధర్, కవిత, సతీశ్, సుచరిత్ర, తాళ్లపెల్లి రమేశ్ పాల్గొన్నారు.