వర్ధన్నపేట, సెప్టెంబర్ 12: ఇల్లందలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఆదివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని పార్టీ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, ఆత్మ చైర్మన్ గుజ్జ గోపాల్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా తదితరుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అంబటి ఎల్లస్వామి, ప్రధాన కార్యదర్శిగా గడ్డం సతీశ్ ఎన్నికయ్యారు.
సంగెం: షాపురం గ్రామ కమిటీని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, బిక్కోజినాయక్తండాలో ఆర్బీఎస్ మండల కన్వీనర్ కందకట్ల నరహరి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. షాపురం అధ్యక్షుడిగా తుత్తురు రమేశ్, ఉపాధ్యక్షులుగా పూజారి శ్రీనివాస్, మేకల స్వామి, పేరాల దిలీప్, కార్యదర్శిగా దేశిని ఓదెలు, సంయుక్త కార్యదర్శిగా మచ్చ వెంకటేశ్వర్లు, యముడాల సారంగం, కోశాధికారిగా తక్కళ్లపల్లి సుజాత ఎన్నికయ్యారు.
బిక్కోజీనాయక్తండా అధ్యక్షుడిగా బదావత్ రమేశ్, ఉపాధ్యక్షులుగా బోడ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా భూక్యా వీరన్న, సంయుక్త కార్యదర్శిగా సపావట్ రవీందర్, కోశాధికారిగా జాటోత్ దివ్య ఎన్నికయ్యారు.
పోచమ్మమైదాన్: వరంగల్ 22వ డివిజన్ కొత్తవాడలోని పద్మశాలి సేవా సంఘం హాల్లో టీఆర్ఎస్ అనుబంధ కమిటీలను డివిజన్ ఇన్చార్జి జోగు చంద్రశేఖర్, పార్టీ నాయకుడు మావురపు గీత విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీసీసెల్ అధ్యక్షుడిగా ముప్పు సదానందం, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండీ ఇంతియాజ్, సోషల్ మీడియా కన్వీనర్‌గా కంచర్ల శివకుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా సమ్మెట శ్రీనాథ్, యూత్ విభాగం అధ్యక్షుడిగా వెల్ది ప్రశాంత్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా రొయ్యల పావని, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా సింగారం శ్రీధర్ ఎన్నికయ్యారు. అలాగే, 23వ డివిజన్ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి జోగు చంద్రశేఖర్ పాల్గొని డివిజన్ యూత్, మహిళా, ఎస్సీ, మైనార్టీ, విద్యార్థి, సోషల్ మీడియా కమిటీలను ఏర్పాటు చేశారు.
పర్వతగిరి: ఎంపీపీ లునావత్ కమల పంతులు, జడ్పీటీసీ సింగ్‌లాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్ సమక్షంలో మూడెత్తుల, మాల్యా, గుగులోత్, తూర్పు తండాల్లో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మూడెత్తులతండా అధ్యక్షుడిగా భూక్యా సుమన్, ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ బాలు, మాల్యాతండా అధ్యక్షుడిగా బానోలు లాలు, ప్రధాన కార్యదర్శిగా గుగులోత్ బాలు, గుగులోత్తండా అధ్యక్షుడిగా మూడు రవి, ప్రధాన కార్యదర్శిగా బానోత్ కిట్టు, తూర్పుతండా అధ్యక్షుడిగా బానోత్ మోహన్, ప్రధాన కార్యదర్శిగా బానోత్ కిరణ్ ఎన్నికయ్యారు.