పార్వతీపుత్రుడికి విశేష పూజలు
కొనసాగుతున్న నవరాత్రోత్సవాలు
ఖానాపురం/నర్సంపేట/కరీమాబాద్/పోచమ్మమైదాన్/పర్వతగిరి/గీసుగొండ, సెప్టెంబర్ 12: గణపతి నవత్రోత్సవాలను పురస్కరించుకుని పార్వతీపుత్రుడు ఆదివారం మూడో రోజు విశేష పూజలందుకున్నాడు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఖానాపురంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు సతీసమేతంగా పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. దాతలు ఉప్పు రాజు, తూడి కోటి అన్నదానం చేశారు. సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, తక్కళ్లపల్లి రమేశ్, రాజిరెడ్డి, ముడుసు రమేశ్ పాల్గొన్నారు. నర్సంపేటలోని మార్కండేయ నగర్లో వినాయక మండపం వద్ద అన్నదానం చేశారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్నె సర్వేశం, మార్కండేయ పొదుపు సంఘం అధ్యక్షుడు బూర చందర్రావు, కొమ్మాల దేవాలయ శాఖ ఉద్యోగులు పేరాల కనుకయ్య, విజయలక్ష్మి పాల్గొన్నారు. కరీమాబాద్‌లోని రామస్వామి గుడి సమీపంలో మహేశ్వర పరపతి సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దాతలు మడత మాధవి-యుగేంధర్ దంపతులు, మహేశ్వ పరపతి సంఘం సభ్యులు మడత ఉపేందర్, లక్కాకుల శ్యామ్, వడ్నాల సామ్రాట్, రాచర్ల సురేశ్, అడ్డగట్ల నవీన్, క్రాంతి, మడత కిరణ్ పాల్గొన్నారు. అలాగే, కరీమాబాద్ జన్మభూమి జంక్షన్‌లోని ఓరుగల్లు గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్పొరేటర్ సిద్ధం రాజు పాల్గొన్నారు. పోచమ్మమైదాన్ పరిధి 23వ డివిజన్ కొత్తవాడలో పార్వతీపుత్ర గణపతి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మండపం వద్ద యెలుగం వెంకటమల్లు-సునంద దంపతులు అన్నదానం చేశారు.
మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి-సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేశాయిపేట 80 ఫీట్ల రోడ్డులో గణపతి వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. కార్పొరేటర్ బస్వరాజు చిన్న కుమారస్వామి, మాజీ కార్పొరేటర్ శారద-సురేశ్‌జోషి పాల్గొన్నారు. పర్వతగిరి మండలం వడ్లకొండలో యువనేస్తం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమడగాని రాజు ప్రారంభించారు. యూత్ నిర్వాహకులు మేకల కుమారస్వామి, కొండ రాజు, సీహెచ్ రమేశ్, శ్రావణ్, సంతోష్, నాగరాజు, సాంబరాజు, రమేశ్, వినయ్, వినోద్, సాయి, సాగర్, రాజు పాల్గొన్నారు. గీసుగొండ మండలంలోని మచ్చాపురం జీపీ ఆవరణలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద గ్రామానికి చెందిన రిజర్వు ఇన్స్పెక్టర్ దూపటి సురేందర్, విజయలక్ష్మి దంపతులు అన్నదానం చేశారు. సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ యుగేంధర్, భాస్కర్, బుచ్చిబాబు, రాకేశ్, విజయ్, శరత్, సరిత పాల్గొన్నారు.