ఐలమ్మ జయంతిని అధికారికంగా జరపడంపై సర్వత్రా హర్షం
సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం
సంబురాలు జరుపుకుంటున్న రజకులు
దేవరుప్పుల, సెప్టెంబర్ 12: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలనే నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని రజక సంఘం నాయకులు అన్నారు. ఆదివారం కడవెండి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రజక సంఘం నాయకుడు పైండ్ల వెంకటరమణ, సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సర్పంచ్ పోతిరెడ్డి బెత్లీనారెడ్డి పాల్గొనగా, రజక సంఘం నాయకులు మాట్లాడారు. వీరనారి ఐలమ్మను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో తెలంగాణ జాతికే గౌరవం దక్కినట్లు అయిందన్నారు. ఐలమ్మ పోరాట పటిమ మహిళల్లో చైతన్యం తెచ్చిందని, తెలంగాణతో పా టు, దేశ విముక్తికి నాంది పలికిందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాగేశ్, ఏఎంసీ డైరెక్టర్ తాటిపల్లి మహేశ్, మాజీ సర్పంచులు సుడిగెల హనుమంతు, పడమటింటి కొమురయ్య, రజక సంఘం నాయకులు అంజయ్య, సోమయ్య, వార్డు సభ్యులు కుమార్, సోమన్న, నాయకులు కోల యాదగిరి, బాషిపాక భిక్షపతి, నర్సయ్య, పరశురాములు, నర్సింహాచారి, వీరాచారి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
నర్మెట: చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలోని రజకులు రుణపడి ఉంటామని గండిరామవరం సర్పంచ్ బావండ్లపల్లి భూమాతరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రజకులకు సముచిత స్థానం కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో చాగంటి రాజేశ్, సత్యనారాయణ, సుధాకర్, శేఖర్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.