వాడవాడలా రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం
కొలతలు తీస్తున్న అధికారులు
ఆనందం వ్యక్తం చేస్తున్న దళిత, గిరిజనులు
దేవరుప్పుల, ఆగస్టు 12: ప్రభుత్వం దళిత, గిరిజన వాడల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కోలుకొండ, బంజర, ధర్మగడ్డ తండా, చిప్పరాళ్లబండ తండా, పొట్టిగుట్ట తండాల్లో అధికారులు దళిత, గిరిజన వాడలను సందర్శించి సభలు నిర్వహించారు. ఎంపీపీ బస్వ సావిత్రి, మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొర్నేలియస్, ఎంపీడీవో ఉమామహేశ్వర్, ఎంపీవో కవికుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో సందర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కూర్నాల రవి, మాలోత్ కవిత, బానోత్ సునీ త, భూక్యా శ్రీనివాస్, మూడ శంకర్, పంచాయతీ కార్యదర్శులు రత్నమాల, క్రాంతికుమార్, అనిల్, శ్రీకాంత్, నజీరొద్దీన్, పీఆర్ ఏఈ సతీశ్ పాల్గొన్నారు.
మచ్చుపహాడ్‌లో అధికారుల పర్యటన
నర్మెట : మండలంలోని మచ్చుపహాడ్ దళితకాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లోని సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి అంచనాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రామిని శివరాజ్, ఎంపీడీవో ఖాజానయీమొద్దీన్, ఉపసర్పంచ్ కొంపెల్లి రాజు, పంచాయతీ కార్యదర్శి నర్సింహ్మ, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ బానోత్ సోమ్లానాయక్, అంగన్వాడీ టీచర్లు రాధిక, నాగమణి, వీవోఏ శ్రీలత, గ్రామస్తులు ఎల్లయ్య, బిక్కు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి
బచ్చన్నపేట : దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించేందుకే ప్రభుత్వం ‘దళిత సాధికారిత’ను చేపట్టిందని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని లింగంపల్లి, కట్కూర్, లక్ష్మాపూర్, సాల్వాపూర్, బండనాగారం గ్రామాల దళితవాడల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రఘురామకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. దళిత వాడల్లోని సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కుందెన, ముశిని సునీత, నవ్య, శివరాత్రి కవిత, లక్ష్మి, గూడెపు లత, ఉప సర్పంచ్ భాస్కర్, శ్రీనివాస్, రాజలింగం, ఈసీ మోహన్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ ఏఈలు అరుణ, శ్రీనివాస్, ఆర్అండ్బీ ఏఈ శ్రీశైలం, టీఏలు సత్యనారాయణ, భాను, స్వామి, కరుణాకర్, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు పాల్గొన్నారు.
దళితుల కుటుంబాల్లో వెలుగులు
జనగామ రూరల్ : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఎంపీపీ మేకల కలింగరాజు అన్నారు. మండలంలోని శామీర్‌పేట, గోపరాజుపల్లి, పెద్దతండా(వై) గ్రామాల్లోని దళితవార్డుల్లో గురువారం పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. దళితులు ఆర్థికాభివృద్ధి సాధించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో హిమబిందు, ఎంపీవో సంపత్ కుమార్, సర్పంచ్‌లు మాండ్ర రవికుమార్, కృష్ణారెడ్డి, లచ్చిరాం నాయక్, ఉప సర్పంచ్ పిడుగు ఆశీర్వాదం పాల్గొన్నారు.