అడవి బాటన గూడేనికి చేరిన డీఎంహెచ్‌వో
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచన
గొత్తికోయ మహిళలకు చీరెల పంపిణీ
గోవిందరావుపేట, అక్టోబర్ 9 : అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలనే ప్రభుత్వ సూచన మేరకు డీఎంహెచ్‌వో అప్పయ్య, ఎంపీపీ సూడి శ్రీనివాస్‌రెడ్డి, పస్రా ఎస్సై కరుణాకర్‌రావు అడవి బాట పట్టారు. గతంలో గొత్తికోయలకు వైద్య సిబ్బంది వ్యాక్సిన్ వేయడానికి వెళ్లగా వారిని వెనుక్కు పంపించారు. ఈ క్రమంలో వ్యాక్సిన్ అందించలానే ఉద్దేశంతో ఎస్సై, ఎంపీపీతో కలిసి డీఎంహెచ్‌వో గూడేనికి వెళ్లారు. వాక్సినేషన్ అనంతరం గొత్తికోయ మహిళలకు చీరెలు పంపిణీ చేశారు.
108 సిబ్బంది సేవలు అభినందనీయం
ములుగురూరల్, అక్టోబర్ 9 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను కాపాడిన 108 వాహన సిబ్బంది సేవలు అభినందనీయని డీఎంహెచ్‌వో డాక్టర్ అల్లెం అప్పయ్య అన్నారు. జిల్లాలో పనిచేస్తున్న 108 వాహన సిబ్బంది 100 శాతం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాడ్జీలను అందజేశారు. కార్యక్రమంలో 108 ములుగు జిల్లా అధికారి చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.