జనగామ చౌరస్తా, అక్టోబర్ 9 : రెండు రోజుల నుంచి రాత్రి కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. ముఖ్యంగా కుర్మవాడ అవోపా బిల్డింగ్ ఏరియా, శ్రీనగర్‌కాలనీ, జ్యోతినగర్, బాలాజీ నగర్, రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని లోతట్టు ప్రాంతాలన్నీ వరద నీటితో నిండిపోయాయి. పట్టణ కేంద్రం నుం చి హైదరబాద్‌కు వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న రహదారిపైకి వరద నీరు చేరడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణ కేంద్రానికి ఎగువన ఉన్న రంగప్ప చెరువు మత్తడి పోయడంతో వరద ఉధృతి మరింత పెరిగి, ప్రక్కనే ఉన్న లోతట్టు కాలనీలు జలమయమవుతున్నాయి. పట్టణ కేంద్రంలో వరద నివారణకు వెంటనే చర్యలు చేపట్టాలంటూ స్థానిక ప్రజలతో పాటు కాం గ్రెస్, సీపీఎం నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.
జనగామ రూరల్: మండలంలోని కొన్ని గ్రామాల్లో రాత్రి కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రోడ్లపై వరద చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పండింది. పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లోని వాగులు, వంకలు పొంగుతున్నాయి. వరద పరిస్థితిపై అధికారులు, ప్రజా ప్రతినిధులు సమీక్షిస్తున్నారు. పెంబర్తిలోని కంబాల కుంట నిండి మత్తడి పోయడంతో ప్రధాన రహదారిపై వరద తీవ్రంగా రావడంతో సర్పంచ్ అంబాల ఆంజనేయులు నేషనల్ హైవే అధికారులు, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి వరదను మల్లించారు. మండలంలోని సిద్దెంకి, పెంబర్తి, ఎల్లంల, శామీర్‌పేట, పసరమడ్ల, పెద్దరాంచర్ల, ఓబుల్ కేవ్వాపూర్ గ్రామాల్లో పంటలు నీటిలో మునిగాయి. సిద్దెంకి-ఎల్లంల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డం తీవ్రంగా వరద ప్రవహించడం తో రాకపోకలు నిలిపివేశారు.
లింగాలఘనపురం: మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో వరద నీరు చేరింది. మండలంలో 60 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిళ్లినట్లు ప్రాథమిక అంచనా వేశామని ఏవో జయంత్‌కుమార్ తెలిపారు. పటేలుగూడెంలో కల్వర్టు వద్ద వరద పొంగి ప్రవహిస్తోంది. తహసీల్దార్ వీరస్వామి, ఎంపీవో మల్లికార్జున్ పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలను నిలిపివేసి గస్తీని ముమ్మరం చేశారు. కుందారం, రెడ్డి పురం, కిష్టగూడెం, తుర్కగూడెం, కిష్టగూడెం, చీటూ రు గ్రామాలకు రావాణా సౌకర్యం నిలిపివేశారు.