భాషతో పాటు యాసను ప్రజల్లోకి తీసుకువెళ్లిన మహనీయుడు
మేయర్ గుండు సుధారాణి
కౌన్సిల్ హాల్లో బల్దియా కమిషనర్ ప్రావీణ్యలతో కలిసి ఆయన చిత్రపటం వద్ద నివాళి
మట్టి వినాయకుల పంపిణీ
వరంగల్, సెప్టెంబర్ 9 : కాళోజీ రచనలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని మేయర్ గుండు సుధారాణి అన్నారు. గురువారం కాళోజీ 107వ జయంతిని పురస్కరించుకొని నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాళోజీ తెలంగాణ వైతాళికుడు అని అన్నారు. భాషతో పాటు యాసను ప్రజల్లోకి తీసుకువెళ్లిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. కాళోజీ జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపడం ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి నిదర్శనమన్నారు. వరంగల్లో వైద్య యూనివర్సీటికి కాళోజీ పేరు పెట్టడం ముదావహం అన్నారు. కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. కాళోజీని భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకొని వారి భావజాలాన్ని అనుకరించాలన్నారు.
మట్టి వినాయకుల పంపిణీ..
పర్యావరణ హితం కోసం మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ప్రావీణ్యతో కలిసి బల్దియా అధికారులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మేయర్ గుండు సుధారాణికి డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మట్టి వినాయక విగ్రహాన్ని అందజేశారు.
కుటీర పరిశ్రమల ఏర్పాటుకు సహకారం
స్వయం సహాయక సంఘాలు కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తే బల్దియా ప్రోత్సాహం అందిస్తుందని మేయర్ అన్నా రు. బల్దియా కార్యాలయంలోని మెప్మా భవన్లో ఏర్పాటు చేసిన ఆర్పీల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగం త గ్గించేలా మహిళా సంఘాల సభ్యులకు ఆర్పీ లు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమాల్లో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, అదనపు కమిషనర్ నాగేశ్వర్, చీఫ్ ఎంహెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్వో సునీత, డీఎఫ్వో కిశోర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్యాదవ్, జోనా, కార్యదర్శి విజయలక్ష్మి, టీ ఎంసీ రమేశ్, సీవోలు ప్రవీణ్, శ్రీలత, సునీల్ కుమార్, మాధవి, రజిత పాల్గొన్నారు.