నమస్తేతెంగాణ నెట్వర్క్, సెప్టెంబర్9: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గురువారం ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. భూపాలపల్లిలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, డీసీవో సూపరింటెండెంట్ అయూబ్ ఖాన్, ఇన్సె క్టర్లు జీనీ నరసింహులు, వాసుదేవరావు, వేణు, సతీశ్, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి జడ్పీ కార్యాలయంలో జడ్పీ సీఈవో శోభారాణి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీ సూపరిండెంట్ శ్రీనాథ్, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రగతి భవన్లో డీఆర్డీవో పురుషోత్తం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ మల్చూర్, ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ ధరంసింగ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో అనిల్, జిల్లా దవాఖానలో సూపరింటెండెంట్ జీడీ తిరుపతి, జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్‌వో శ్రీరాం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రోజారాణి, పీఏసీఎస్ డైరెక్టర్ బెడ్డల పోశయ్య, సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో టీఎన్జీఓఎస్ జిల్లా అధ్యక్షుడు రవి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
కార్యదర్శి హరికృష్ణ, ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు. చిట్యాల విద్యావనరుల కేంద్రంలో ఎంఈవో రఘుపతి, నవాబుపేటలో సర్పంచ్ కసిరెడ్డి సాయిసుధ రత్నాకర్‌రెడ్డి, చల్లగరిగెలో సర్పంచ్ మంజూల, గిద్దెముత్తారంలో పొలవేణ పోషాలు, జూకల్‌లో మహేందర్, మండల కేంద్రంలో పూర్ణ చందర్రావు నివాళులులర్పించారు. రేగొండ మండలం రామాన్నగూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం కామిడి సతీశ్‌రెడ్డి ఆధ్వర్యంలో , మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో జగ్గయ్యపేట జీపీ కార్యాలయంలో సర్పంచ్ పాతపేల్లి సంతోష్ కాళోజీ నివాళులర్పించారు. పలిమెల మండలం పంకెనలో సర్పంచ్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి మట్టి వరలక్ష్మి కాళోజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాటారంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో కాలోజీ జయంతి నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజేందర్, పేరెంట్ కమిటీ అధ్యక్షుడు నెహ్రూ నాయక్, వైస్ ప్రిన్సిపాల్ సిరిసిల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టేకుమట్ల మండలంలోని అన్ని జీపీల్లో కాళోజీ జయంతి నిర్వహించారు. మహాముత్తారం మండలంలోని ములుగుపల్లిలో సర్పంచ్ మల్లయ్య గౌడ్ పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యదర్శి అనిల్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణపురం మండల కేంద్రంలో కాళోజీ జయంతి నిర్వహించారు. సర్పంచ్ దేవేందర్‌గౌడ్, బుద్దారం సర్పంచ్ గండ్ర ఆంగరావు, లక్ష్మారెడ్డిపల్లి సర్పంచ్ ఒద్దుల విజయ, గాంధీనగర్ సర్పంచ్ మాదం మమత, కర్కపల్లి సర్పంచ్ పొట్ల నగేశ్, మైలారం సర్పంచ్ నల్లాని అరుణ, చెల్పూరు సర్పంచ్ నడిపెల్లి మధుసూధనారావు, అప్పయ్యపల్లి సర్పంచ్ ఐలోని శశీరేఖా, బస్వరాజ్‌పల్లి సర్పంచ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా జీఎం కార్యాలయంలో కాళోజీ జయంతి నిర్వహించారు. జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు భూపాలపల్లి, ఏజీఎం ఎస్ జ్యోతి, పైనాన్స్ మేనేజర్ అనురాధ, ఎస్ఈ శ్రీనివాస్ కుమార్, ఇంచార్జి అధికార ప్రతినిధి కేశవరావు పాల్గొన్నారు.
మల్హర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు అధ్యక్షతన కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లారం, దుబ్బపేట, తాడిచెర్ల కార్యాలయాల్లో కాళోజీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ములుగు కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వో రమాదేవి కాళోజీ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో గౌస్ హైదర్, జిల్లా సంక్షేమ భవనంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏఎస్పీ చెన్నూరి రమేశ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ రజనీలత, ఆయా కార్యాలయాల్లో కాళోజీ జయంతి నిర్వహించారు. కలెక్టరేట్ ఏవో శ్యామ్, సూపరింటెండెంట్ రాజ్ ప్రకాశ్, డీసీవో మాలోత్ సర్ధార్ సింగ్, డీపీఆర్వో ప్రేమలత, ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్ మండలకేంద్రంలోని ఎంపీడీవో, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో కాళోజీ జయంతి నిర్వహించారు. ఎంపీపీ బన్సోడ రాణిబాయి, సర్పంచ్ శ్రీపతిబాపు, ఉపసర్పంచ్ సల్మాన్‌ఖాన్, జడ్పీటీసీ గుడాల అరుణ, వైస్ ఎంపీపీ పుష్పలత, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేశ్తదితరులు పాల్గొన్నారు. ఏటూరునాగారం మండలంలో కాళోజీ జయంతిని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల్లో నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ ఆదర్శ సురభీ పాల్గొని కాళోజీ చిత్ర పటానికి పూల మాల సమర్పించారు.
కార్యక్రమాల్లో ఏపీవో వసంతరావు, పీఏవో లక్ష్మీ ప్రసన్న, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హేమలత, ఏవో దామోదర్‌స్వామి, ఎస్వో రాజ్‌కుమార్, ఏఏవో సంతోశ్, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, మేనేజర్ భూక్యా లాల్, అక్కౌంట్స్ మేనేజర్ కరీం, పెసా జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన గురుకుల బాలుర కళాశాలలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. రొయ్యూరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు చంద్రమొగిళి, ఉపాధ్యాయులు పాల్గొనగా, మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో అధ్యాపకుడు రఘపతి పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం అడవిరంగాపూర్లో సర్పంచ్ మహేందర్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ మంజుల పాల్గొన్నారు. తాడ్వాయి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సత్యాంజనేయప్రసాద్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజేడు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకుడు శ్రీనివాసరాజులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వెంకటాపురం(నూగూరు) మండలలో కాళోజీ నారాయణరావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ చెరుకూరిసతీశ్, తహసీల్దార్ అంటినాగరాజు, ఎంపీడీవో ఫణి చంద్ర, డీటీ రాము, తదితరులు పాల్గొన్నారు