జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
బచ్చన్నపేట, అక్టోబర్7 : రక్తదానం అన్ని దానాల్లో గొప్పదని జనగామ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎస్సై జలగం లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీ గార్డెన్లో రక్తదానం శిబిరం నిర్వహించారు. 100 మంది వరకు రక్తం దానం చేశారు. ఈ కార్యక్రమానికి డీసీపీ హాజరై మాట్లాడారు. ప్రమాదాల బారిన పడ్డ వారు సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, అందుకే రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయొచ్చని అన్నారు. శిబిరాల్లో స్వచ్ఛందంగా ప్రజలు రక్తదానం చేయాలని కోరారు. రక్తదాన శిబిరం విజయవంతానికి కృషి చేసిన పోలీసులు, బచ్చన్నపేట మండల సర్పంచ్, ఎంపీటీసీలను డీసీపీ అభినందించారు. సేకరించిన రక్త నమూనాలను ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుకు పంపినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్మెట సీఐ కరుణాకర్, సర్పంచ్ల ఫోరం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గంగం సతీశ్‌రెడ్డి, దూడల కనుకయ్యగౌడ్ , జడ్పీవైస్చైర్పర్సన్ గిరబోయిన భాగ్యలక్ష్మిఅంజయ్య, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతికృష్ణంరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బోడిగం చెంద్రారెడ్డి, ఎంపీటీసీ కర్ణాల వేణుగోపాల్, జనగామ కౌన్సిలర్ మల్లవరం అరవింద్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి, సర్పంచ్‌లు వడ్డేపల్లి మల్లారెడ్డి, బాల్‌రెడ్డి, కోనేటి స్వామి, భవానీశశిధర్రెడ్డి, మాధవీభాస్కర్రెడ్డి, రజిత వెంకట్‌రెడ్డి, నాయకులు అయిలయ్య, ప్రతాపరెడ్డి, సిద్దిరాంరెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు దీపక్ , ఆటో, ట్రాక్టర్ యూనియన్ పాల్గొన్నారు