ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జాతీయ దినోత్సవం
సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ
జనగామ, నమస్తే తెలంగాణ, ఆగస్టు 7 : చేనేత కార్మికులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో చేనేత, జౌళీ శాఖల ఆధ్వర్యంలో స్థానిక ఆర్అండ్బీ అతిధి గృహం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముత్తిరెడ్డి మాట్లాడారు. చేనేత వస్ర్తాలను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను కార్మికులకు వర్తింపచేసేలా జిల్లా యంత్రాంగం కృషి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా చేనేత రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న1,559 మందికి జియో ట్యాగింగ్ చేసే ప్రక్రియ పూర్తి చేశామని, ఇందులో 1,459 మందికి రూ.1.72 కోట్లు మంజూరు చేశామన్నారు. చేనేత మిత్రపథకం ద్వారా 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ముత్తిరెడ్డి వెల్లడించారు. చేనేత కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వృత్తిదారులకు ప్రాధాన్యత ఇస్తున్నదని ముత్తిరెడ్డి వివరించారు. ముఖ్యంగా చేనేత వస్ర్తాలను ప్రతి ఒక్కరూ ధరించేలా ప్రజలను చైతన్యపర్చాలని ఆయన అధికారులను కోరారు. అనంతరం చేనేత కార్మికులతో ప్రతిజ చేయించి నేత కార్మికులను సన్మానించారు. చేనేత వస్ర్తాల స్టాల్‌ను ఆయన సందర్శించి వస్ర్తాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, హ్యాండ్లూమ్ ఏడీ సాగర్, పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ సుచిత్ర, కౌన్సిలర్ గుర్రం భూలక్ష్మి, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు వేముల బాలరాజు, రచ్చ బాల్‌నర్సయ్య, రచ్చ కృష్ణమూర్తి, సీహెచ్ కృష్ణమూర్తి, గణపురం ఆనంద్, బేతి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు సన్మానం
జనగామ రూరల్ : జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మంగళంపల్లి సిద్ధిరాములు, కాముని సత్యనారాయణను శనివారం లయన్స్‌క్లబ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ మిలీనియం అధ్యక్షుడు మా చర్ల బాలరాజు, కార్యదర్శి కాముని శ్రీనివాస్, కోశాధికారి గాదె నర్సింహులు, పీఆర్సీ శ్రీరాం శ్రీనివాస్, దోర్నాల యాదగిరి పాల్గొన్నారు.
పాలకుర్తిలో చేనేత కార్మికుల ర్యాలీ
పాలకుర్తి : చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న వస్ర్తాలు ఎంతోమన్నికగా ఉండడమేగాక రాష్ర్టానికి ఎంతో పేరుప్రఖ్యాతులు తీసుకొస్తున్నాయని పలువురు వక్తలు కొనియాడారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమనాథ మండల సంఘం, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మం డల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంఘం మండల అధ్యక్షుడు మాచర్ల సారయ్య మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి సబ్సిడీలు తగ్గించడం అన్యాయమన్నారు. ఈ నేపథ్యంలో చేనేత కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దేవసాని కృపాకర్, కూరపాటి సుదర్శన్, రాపోలు రాంబాబు, బైరు భార్గవ్, శ్రీరామ్ సుధాకర్, వెంకటేశ్వర్లు, ఎనగందుల సత్తయ్య, పిండిబోర్డు సత్యనారాయణ, ఈగ శ్రీనివాస్, వైట్ల రాజు, నరేశ్, రాంబాబు, యాకయ్య పాల్గొన్నారు.
చేనేత కార్మికులకు సర్కారు భరోసా
కొడకండ్ల : రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని స్థానిక సర్పంచ్ పసునూరి మధుసూదన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషితో కొడకండ్లలో మినీ టెక్ట్స్‌టైల్ పార్కు ఏర్పాటు కానుందన్నారు. నేత కార్మికులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. ఈ కార్యాక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు దోర్నం ప్రభాకర్, నాయకులు మసురం వెంకటనారాయణ, మసురం రమేశ్, పసునూరి నవీన్, పసునూరి రాజు పాల్గొన్నారు.