ఆర్డీవో, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్
గురిజాల లో-లెవల్ కాజ్వే పరిశీలన: ఎమ్మెల్యే పెద్ది
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
నర్సంపేట, సెప్టెంబర్ 6 : వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. సోమవారం అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అలర్టుగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు నర్సంపేటలోనే అందుబాటులో ఉండాలని, సెల్ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయొద్దన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్నగర్ ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, రోడ్డు మీద వరద నీరు ప్రవహించే ప్రదేశాల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలను పరిశీలించాలన్నారు. 24 గంటలు నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, ఏ అవసరం వచ్చినా తనకు సమాచారం అందించాలన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. టెలీ కాన్ఫరెన్స్‌లో ఆర్డీవో పవన్‌కుమార్, రెవెన్యూ, పోలీసు, మున్సిపాలిటీ, వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, ఎలక్ట్రికల్, వ్యవసాయశాఖ అధికారులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
గురిజాల కాజ్వే పరిశీలన..
నర్సంపేట రూరల్ : మండలంలోని నర్సంపేట-గురిజాల ప్రధాన రహదారిలోని లో-లెవల్ కాజ్‌వేపై ఉ ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. పలు శాఖల అధికారులకు సూ చనలు చేశారు. లో లెవల్ కాజ్వే పైనుంచి ఎవరూ ప్ర యాణించకుండా చూడాలని సూచించారు.
బాధిత కుటుంబానికి పరామర్శ..
మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల నాయకుడు, గౌడ సంఘం గ్రామ అధ్యక్షుడు కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్ (56) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది అతడి కుటుంబాన్ని పరామర్శించారు. తొలుత శ్రీనివాస్‌గౌడ్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి రూ.10వేలు అందించారు. సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత, ప్రభుత్వ న్యాయవాది మోటూరి రవి, మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్‌గౌడ్, గొడిశాల సదానందంగౌడ్, బండారి రమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రి కుమారస్వామి, నాయకులు కొమ్మ రవి, అన్న కోమల, అన్న రాజమల్లు, ఆకుల అశోక్, కొక్కు రాంరాజ్ తదితరులు ఉన్నారు.