భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
గణపురం/కృష్ణకాలనీ, డిసెంబర్4: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుర్రకాయల గూడెం గ్రామంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ భాస్కర్, మండల వ్యవసాయ అధికారి ఐలయ్య, సీఈవో గోవర్ధన్‌రెడ్డి, గణపురం పీఏసీఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు, సర్పంచ్ లు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుర్రం తిరుపతి గౌడ్, మండల నాయకులు మెతె కరుణాకర్ రెడ్డి, బొయిని సాంబయ్య, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపల్ 11వ వార్డు పెద్దకుంటపల్లిలో జంగేడు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ బానోత్ రజిత జుమ్ములాల్ ప్రారంభించారు. ధాన్యంలో తేమ 17 శాతానికి మించి ఉండకుండా రైతులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ 11వ వార్డు అధ్యక్షుడు దుండ్ర కుమార్ యాదవ్, యూత్ అధ్యక్షుడు రాజేందర్ యాదవ్ నాయకులు భూక్యా రాజ్ కుమార్, నంగావత్ రామకృష్ణ, భూక్యా రాజు పాల్గొన్నారు.