ములుగు, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టుల పేరుతో వ్యాపారుల నుంచి చం దాలు వసూలు చేస్తున్న నలుగురు నకిలీ మావోయిస్టులను పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ డాక్ట ర్ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసి సమావేశం లో నిందితుల అరెస్టుతో పాటు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న మావోయిస్టుల పేరు చె ప్పి ఏటూరునాగారంలో రూ.20 లక్షలు మావోయిస్టు పార్టీకి చందాగా ఇవ్వాలని ఓ వైద్యుడిని బెదిరించగా పోలీసులకు సమాచారం ఇచ్చాడన్నారు. ఏటూరునాగారం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని, తనిఖీ చేయగా నకిలీ ప్లాస్టిక్ తుపాకీ, మావోయిస్టు నేత దామోదర్ పేరుతో తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీ లెటర్ ప్యాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అ నంతరం అతడిని విచారించగా మరో ముగ్గురు కూడా ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిపారు. రొ య్యూరు గ్రామ శివారులో ప్రధాన నిందితుడి కోసం వేచిచూస్తున్నారని తెలపగా ఎస్సై ఆ ప్రదేశానికి సిబ్బందితో కలిసి వెళ్లి మిగిలిన ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిం దితులను విచారించగా ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాచనలో ఈ దోపిడీకి పథక రచన చేసినట్లు తెలిపారు. మావోయిస్టులు రాసినట్లుగానే లెటర్ రాసి మావోయిస్టు పార్టీ వారే పంపారనే విధంగా లెటర్ పొందుపర్చినట్లు తెలిపారు. మూడు నెల ల కాలంలో వీరు నలుగురు వ్యక్తులను బెదిరించి రూ.10 నుంచి రూ.20 లక్షలు ఒక్కో వ్యక్తి వద్ద డిమాండ్ చేసినట్లు చెప్పారు. కాగా, ఒక వ్యక్తి వీరికి భయపడి రూ.15 లక్షలు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితులపై ములుగు జిల్లాలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.13.50 లక్షల నగదు, సీపీ ఐ మావోయిస్టు పార్టీ నేత దామోదర్ పేరుతో ఉ న్న లెటర్లు, ఒక నకిలీ తుపాకీ, కారు, మోటార్ సైకిల్, 4 మొబైల్ ఫోన్లు, కలర్టీవీతో పాటు ఒక మిక్సర్ గ్రైండర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న ఏటూరునాగా రం పోలీసులను ఎస్పీ అభినందించారు. నేర ప్ర వృత్తి గల వ్యక్తులు, దోపిడీలకు పాల్పడే ముఠాల సమాచారాన్ని పోలీస్ శాఖకు తెలిపినట్లయితే ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు వారిపై కఠి న చర్యలు తీసుకుంటామని ఎస్పీ వివరించారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ గౌస్ ఆలం, ములుగు ఏఎస్పీ చెన్నూరి రూపేశ్, సీఐ కిరణ్, ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.