బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు మహిళలకు చీరెల పంపిణీ
ఎంపీపీ మోతె కళావతి
నర్సంపేట రూరల్, అక్టోబర్ 3: రాష్ట్రంలోని ఆడపడుచులకు చినుకానుకగా బతుకమ్మ చీరెలను సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ అందిస్తున్నదని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. మండలంలోని ముగ్ధుంపురం జీపీ కార్యాలయ ఆవరణలో ఆదివారం మహిళలకు బతుకమ్మ చీరెలను ఎంపీపీ మోతె కళావతి, సర్పంచ్ పెండ్యాల జ్యోతి, ఎంపీటీసీ చీకటి స్వరూప పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ పర్వదినాన్ని ఏటా మహిళలు ఘనంగా నిర్వహించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చీరెలను కానుకగా అందస్తున్నదని వివరించారు. ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ చాందావత్ తిరుపతినాయక్, కార్యదర్శి రహీంపాషా, వార్డు సభ్యులు పెండ్యాల సదానందం, ప్రభాకర్, గ్రామపెద్దలు పాల్గొన్నారు. గురిజాల జీపీలో మహిళలకు సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత వార్డు సభ్యులు, కార్యదర్శి రాజమౌళితో కలిసి చీరెలు పంపిణీ చేశారు.
పండుగలకు పూర్వ వైభవం
చెన్నారావుపేట/గీసుగొండ: పండుగలకు తెలంగాణ ప్రభుత్వం పూర్వవైభవం తీసుకొస్తున్నదని తిమ్మరాయినీపహాడ్ సర్పంచ్ కొండవీటి పావనీప్రదీప్ అన్నారు. గ్రామంలోని మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శౌరీరాజు, వార్డు సభ్యులు ఎండీ నిజాం, విలియంబోర్డర్, టీఆర్ఎస్ గ్రామ మాజీ అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకుడు రమేశ్, అంతుమేరీ, సుధారాణి పాల్గొన్నారు. గీసుగొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దౌడు మహిళలకు చీరెలు అందించారు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని సర్పంచ్ కొనియాడారు. కార్యక్రమంలో కార్యదర్శి వేణుప్రసాద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు దేశాయిపేటలో చీరెల పంపిణీ
పోచమ్మమైదాన్: వరంగల్ 13వ డివిజన్‌కు సంబంధించిన మహిళలకు దేశాయిపేటలోని సీఎస్ఐ చర్చిలో సోమవారం ఉదయం 8 గంటలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేయనున్నట్లు కార్పొరేటర్ సురేశ్‌కుమార్ జోషి తెలిపారు. దేశాయిపేట, నజరత్‌పురం, ఎంహెచ్‌నగర్, లెనిన్‌నగర్, వీవర్స్‌కాలనీలోని లబ్ధిదారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చీరెలు అందజేస్తారని వివరించారు. రేషన్ డీలర్ల ద్వారా కూపన్లు ఇవ్వడం లేదని, రేషన్‌కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని సూచించారు.