ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
ఖిలావరంగల్, సెప్టెంబర్ 2: ఢిల్లీలో భూమిపూజ చేసిన సీఎం కేసీఆర్ నూతన చరిత్రకు నాంది పలికారని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగను ఖిల్లాలో 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమాదామోదర్యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డిప్యూటీ మేయర్ రిజ్వానాషమీమ్, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, ఆలయాల చైర్మన్లు, ధర్మకర్తలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే కోటలోని అమరవీరుల స్తూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు., తర్వాత టీఆర్ఎస్ జెండా ఎగురవేసి పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఆజాంజాహి మిల్లు మైదానంలోనే వరంగల్ కలెక్టరేట్ సమీకృత భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో 35, 37వ డివిజన్ల కార్పొరేటర్లు సోమిశెట్టి ప్రవీణ్, బోగి సువర్ణాసురేశ్, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల శ్యాం, ఇనుముల మల్లేశం, పీఏసీఎస్ చైర్మెన్ కేడల జనార్దన్, మైనార్టీ నాయకులు ఎండీ వహీద్ అలీ, చేరాలు, శ్రీధర్, వర్మ, నాయకులు పాల్గొన్నారు.