బచ్చన్నపేట, ఆగస్టు 10 : దళితవాడల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే కొనసాగుతున్నది. మంగళవారం మండలంలోని నారాయణపూర్, బసిరెడ్డిపల్లి, తమ్మడపల్లి, కొన్నె గ్రామాల్లోని దళిత వాడల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్‌రెడ్డి మాట్లాడుతూ దళిత కాలనీల్లో మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, పరశురాములు, కవితారాజు, వెంకట్‌గౌడ్, ఎంపీటీసీలు నర్సమ్మ, ఎంపీడీవో రఘురామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌రెడ్డి, రూపాచైతన్య పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : మండలంలోని చినమడూరు, రాంభోజీగూడెం, నీర్మాల, రాంరాంజుపల్లి, లకావత్ తండా, అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లోని దళిత, గిరిజన వాడల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలను స్థానికులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కొర్నేలియస్, మండల ప్రత్యేకాధికారి కొండల్‌రెడ్డి, ఎంపీడీవో ఉమామహేశ్వర్, ఎంపీవో కవికుమార్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు వంగ పద్మ, సింగిరెడ్డి సరిత, మలిపెద్ది శ్రీనివాస్‌రెడ్డి, బండి స్నేహ, పులిగిల్ల సుధాకర్, జాటోత్ కవిత, పంచాయతీ కార్యదర్శులు మహేశ్, రాజు, శ్వేత, మధు, అమరేందర్ పాల్గొన్నారు.
జనగామ రూరల్‌లో..
జనగామ రూరల్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సర్పంచ్ కొత్త దీపక్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చీటకోడూరు, యశ్వంతాపూర్, గానుగుపహాడ్, పెద్దతండా(ఎం) గ్రామాల్లోని దళితవాడల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. దీపక్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గండి లావణ్య, సానబోయిన శ్రీనివాస్, లచ్చిరాంనాయక్ పాల్గొన్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో..
స్టేషన్ ఘన్పూర్ : దళితవాడల్లో సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కోమటిగూడెం సర్పంచ్ గూడెళ్లి అశోక్ అన్నారు. మంగళవారం మండలంలోని రాఘవాపూర్, ఇప్పగూడెం, కోమటిగూడెంలోని దళిత కాలనీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ కార్యక్రమాల్లో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ నర్సయ్య, ఎంపీడీవో కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శులు సంతోష్, శ్రీకాంత్, ఉపాధిహామీ ఏపీవో సతీశ్‌చారి, ఆర్అండ్బీ ఏఈ ఉదయ్, సర్పంచ్ జక్కుల పరశురాములు, లైన్‌మన్ జలేందర్‌రెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ కొమురయ్య, వార్డు సభ్యులు చట్ల రమేశ్, సుక్క రాజు, బత్తిని లక్ష్మి, కారోబార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : మండలంలోని కుందారం, బండ్లగూడెం, గుమ్మడవెళ్లిలోని దళితవాడల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకున్నా రు. స్పెషలాఫీసర్ లత, సర్పంచ్‌లు చాడ సుగుణ, కాటం విజయకుమారస్వామి, కత్తుల శ్రీపాల్‌రెడ్డి, ఎంపీటీసీ కేమి డి భిక్షపతి, ఎంపీడీవో సురేందర్‌నాయక్, ఎంపీవో మల్లికార్జున్ స్థానికులతో మాట్లాడారు. అభివృద్ధి పనులపై నివేదిక పంపుతామని వారు పేర్కొన్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్ : దళితుల అభివృద్ధే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎంపీపీ రడపాక సుదర్శన్ అన్నారు. మండలంలోని కూనూరు దళిత కాలనీల్లో అధికారులతో కలిసి మంగళవారం ఆయన పర్యటించారు. సుదర్శన్ మాట్లాడుతూ దళిత కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇల్లందుల కుమార్, ఉప సర్పంచ్ మం జుల, మండల స్పెషలాఫీసర్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, ఎంపీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఏఈ చంద్రమోహన్, పీఆర్ ఏఈ సందీప్ పాల్గొన్నారు.
పాలకుర్తిలో..
పాలకుర్తి రూరల్ : దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మండల ప్రత్యేకాధికారి ఏపీడీ ఎండీ నూ రొద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని దర్దేపల్లి, లక్ష్మీనారాయణపురంలోని దళిత కాలనీల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళిత కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వనపర్తి ఆశోక్‌కుమార్, ఎం పీవో దయాకర్, ఏపీవో మంజుల, ఏపీఎం రమణాచారి, సర్పం చ్‌లు ఇమ్మడి ప్రకాశ్, మల్యాల సరిత పరశురా ములు, పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, గంట శిరీష, గుండె వేనికుమార్, ఏఈలు పాషా, సుమన్, ప్రశాంతి, ఉపేందర్ మాదిగ, బొడిగె ప్రదీప్, జలగం ఆంజయ్య, టీఏ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొడకండ్లలో..
కొడకండ్ల : గ్రామాల్లోని దళితవాడల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని సర్పంచ్ దండెంపల్లి శ్రీలతాసోమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని నర్సింగపురం దళితవాడలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దళితవాడలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ దైవాదీనం, ఆర్అండ్బీ ఏఈ రమేశ్, సబ్ ఇంజినీర్ రాకేశ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.