స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 10 : గొర్రెలకు, మేకలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందును వినియోగించాలని విశ్వనాథపురం సర్పం చ్ అనుమాల్ల మల్లేశం కోరారు. మంగళవారం మండలంలోని విశ్వనాథపురం, తానేదార్పల్లి గ్రామాల్లో గొర్రెలు , మేకలకు నట్టల నివారణ మందు వేశారు. జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ నర్సయ్య మాట్లాడుతూ జీవాలకు వ్యాక్సిన్ వేయడం ద్వారా అవి ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చక్రధర్‌రావు, పశువైద్యాధికారి డాక్టర్ బీ వినయ్, సిబ్బంది ఎల్ఎస్ఏ రవీందర్, శ్రీనివాస్, పెద్ది వెంకటయ్య పాల్గొన్నారు.
దేవరుప్పులలో..
దేవరుప్పుల : సీజనల్ వ్యాధుల నివారణ కోసం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు వేయించాలని సర్పంచ్ బిళ్ల అంజమ్మ అన్నారు. మండలంలోని కామారెడ్డిగూడెంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి అనూ ష, ఎంపీటీసీ జకీర్, ఉప సర్పంచ్ మరాఠి కృష్ణ, గొ ర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు మరాఠి మల్లేశ్, ఎల్లబోయిన గిరియాదవ్, భిక్షమయ్య, తాటిపల్లి ఉప్పలయ్య, చిందం కొమురయ్య, కంచర్ల మల్లేశ్, బిల్ల యాదవరెడ్డి, కేమిడి సోమయ్య పాల్గొన్నారు.
లింగాలఘనపురంలో..
లింగాలఘనపురం : మండలంలోని జీడికల్లో మంగళవారం జీవాలకు నట్టల నివారణ మందు వేసి నట్లు మండల పశువైద్యాధికారి అనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో గొర్రెల పెంపకందారుల సంఘం అ ధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్‌లో..
జఫర్‌గఢ్ : మండలంలోని రఘునాథపల్లిలో గొర్రె లు, మేకలకు నట్టల నివారణ మందును మంగళ వారం పంపిణీ చేశారు. దీనిని ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల వెంకటస్వామి, సర్పంచ్ బొమ్మి నేని శ్రీదేవి దీనిని ప్రారంభించారు. ఈ కార్య క్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజశేఖర్, ఉప్పు గల్లు పశు వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది సురేశ్, రవీందర్, రమణాచారి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.