జనగామ, మే 26 (నమస్తే తెలంగాణ) : జనగామ నియోజకవర్గంలో రేషన్‌కార్డు ఉన్న వారు ఘట్కేసర్లోని నీలిమ హాస్పిటల్‌కు గత ఏడాదిన్నరగా రోజుకు 350నుంచి 500 మంది చొప్పున ఏటా 50వేల మంది వైద్యసేవలు పొందుతున్నారని వీరి కోసం తాను నెలనెలా సుమారు రూ.కోటిపైగా ఖర్చుచేస్తున్నానని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో జనగామ అర్బ న్, రూరల్, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మం డలాలకు చెందిన 82మందికి రూ.2.46కోట్ల విలువైన చెకులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశా రు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ జాబితాలో రాష్ట్రంలోనే జనగామ నియోజకవర్గం ముందువరుసలో ఉన్నదని, లబ్ధిదారులు చెకులను సకాలంలో బ్యాంకు ఖాతా లో జమ చేసుకోవాలని ఆయన సూచించారు. అసెంబ్లీలో అంశాన్ని లేవనెత్తి జనగామలో సిటీ సాన్ సేవలు అందుబాటులోకి తెచ్చామని, పేద లు వైద్యం కోసం ప్రభుత్వ ప్రభుత్వ ఆస్పత్రితో పా టు నీలిమ దవాఖాన సేవలు కూడా ఉపయోగించుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారందరూ ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోకుండా తన వంతు సహకారం అందిస్తున్నానని, మున్ముందూ పేదల ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పనిచేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
దేవాదుల మోటర్లకు రూ.6కోట్లు ఇవ్వలేరా?
పంటలు ఎండిపోయి అల్లాడుతున్న ఎగువ ప్రాంతమైన జనగామ జిల్లా రైతాంగానికి సాగు నీరందించే గండిరామారంలోని నాలుగు దేవాదుల మోటర్ల నిర్వహణకు రూ.6 కోట్లు ఇవ్వలేని దౌర్భగ్య పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఉన్నదని ఎమ్మెల్యే పల్లా ధ్వజమెత్తా రు. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు, గత బీఆర్ఎస్ సర్కారు అమలు చేసిన సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు కానీ అందాల పోటీలకు మాత్రం రూ.100 కోట్లు ఖర్చుపెట్టడం సిగ్గుమాలిన పని గా అభివర్ణించారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభు త్వం తాగు, సాగునీరు, రైతుబంధు, రైబీమా, పింఛన్, కల్యాణలక్ష్మి, కేసీఆ ర్ కిట్ ఇస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ న్నీ పోయాయన్నారు. కేవలం అందాల పోటీలు ఒకటే వాళ్లకు నచ్చిందని వందల కోట్లు పెట్టి స్పాన్సర్లను తీసుకొచ్చి వాళ్లందరిని ఎలా ఇబ్బంది పెట్టారో పత్రికల్లో అందరూ చూస్తున్నారని మండిపడ్డారు. అసలు ఈ పోటీలు ఎందుకు పెట్టారో ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని, అన్ని విషయాలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో ప్రజల మధ్య చర్చ పెట్టాలని కోరారు. కేసీఆర్ పదేళ్లలో 11సార్లు రైతుబంధు వేశారని ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు.. 420 హామీలు నెరవేర్చేదాకా ప్రతిపక్షపార్టీగా కొట్లాడుతానని అన్నారు.
అదనులో 2నెలలు మోటార్లు బంద్ చేసి గోదావరిలో నిల్వ ఉన్నా నీళ్లు తెచ్చి రైతులకు ఇవ్వలేని తెలివితక్కువ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. పైసల్ లేవు.. అప్పులు అయ్యాయని బదనాం చేసి కేసీఆర్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం తప్ప కాంగ్రెస్ పాలనలో ఒక ఎకరానికీ నీళ్లిచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోకల జమున, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్‌రెడ్డి, నాయకులు ముస్త్యాల దయాకర్, వాంకుడోతు అనిత, ఉల్లెంగుల సందీప్, జూకంటి శ్రీశైలం, పంతులు ప్రభాకర్‌రావు, ఉడుగుల నర్సింహులు, రామకృష్ణ, మామిడాల రాజు, బచ్చన్నపేట మండల నాయకులు చంద్రారెడ్డి, ఇర్రి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.