హనుమకొండ, నవంబర్ 18 : అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని వరంగల్ పశ్చి మ అభ్యర్థి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఇం టీరియర్ డిజైనర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రా ల నుంచి ఇకడికి వచ్చి కూలీలుగా పనిచేస్తున్న కార్మికులందరూ తన ఇంటి వాళ్లన్నారు. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలను అందించి బీఆర్ఎస్ ప్రభుత్వం అండ గా నిలిచిందన్నారు. ఎంతోకాలంగా ఇక్కడ ఉంటున్న వీరి సమస్యల్లో కొన్ని పరిష్కారమయ్యాయన్నారు. మే నెలలో కార్మిక మాసోత్సవం నిర్వహించి కార్మికుల సంక్షేమం, అభివృద్ధి దిశగా పని చేశానని చెప్పారు. కార్మికుల పిల్లల విద్య, వైద్యానికి స హాయ సహకారాలు అందించానని తెలిపారు.
లేబర్ కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను కూడా ఇప్పించానని, జనవరిలో హెల్త్ క్యాంపులు నిర్వహించి మిగతా వారికీ హెల్త్ కార్డులు అం దజేయనున్నట్లు చెప్పారు. ఎటువంటి ఆపద వచ్చినా, దాస్యం అండగా ఉన్నాడని చెప్పాలన్నారు. కరోనా సమయంలో ఏ పార్టీ పట్టించుకోకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వలస కార్మికులను సొంత మనుషుల్లా అక్కున చేర్చుకుని, రవాణా సౌకర్యం, భోజన వసతి కల్పించారని పేర్కొన్నారు. సుమారు 1500 మంది స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపడం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణ కార్యకర్తలు అని అన్నారే తప్ప, కార్మికులు అని ఎపుడు సంబోధించలేదన్నారు. ఈ దఫా 50 వేలకు పైచిలుకు భారీ మెజార్టీతో గెలువడంతో పాటు ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో సిద్ధిక్, సోను, సహిద్, సలీం, బాబా, ఆజాద్, సాజిద్ అలీ, అనూప్, వహీద్, సందీప్, మనోజ్, మున్నీలాల్, శిబు పాల్గొన్నారు.
కాజీపేట : పశ్చిమ నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధి, సేవలను చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి పట్టం కట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ అభ్యర్ధి దాస్యం వినయ్‌భాస్కర్ కోరారు. వడ్డేపల్లి ట్యాంక్ బాండ్‌పై వాకర్స్‌ను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు కృషి చేశానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటూ పరిష్కరించానన్నారు. కార్యక్రమంలో 61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు, డివిజన్ అధ్యక్షుడు కుమ్మరి కోటిలింగం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బొల్లేపల్లి రాజేశ్, సారయ్య, కొండ్ర శంకర్, శ్రీనివాస్‌రెడ్డి, సాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
మడికొండ : అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ను గెలిపిస్తాయని దాస్యం తెలిపారు. 63వ డివిజన్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆ యన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తొలుత మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ నంతరం ఆయన మాట్లాడుతూ.. మూడోసారి బీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాస్ రూ.400లకే అందించనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు ఉన్న పేదలందరికీ సన్నబి య్యం అందిస్తామన్నారు. అలాగే పేదలకు రూ.5లక్షల బీమా సౌకర్యం కూడా కల్పించనున్నట్లు చెప్పారు. ఎంపీ దయాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎకడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మేయర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రైల్వే రిటైర్డ్ టీసీ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు బెదరకోట రంజిత్ కుమార్, ఇన్చార్జి మిట్టపల్లి రవీందర్, నాయకులు ఎండీ సోని, షేక్ మహమూద్, బరిగెల వినయ్, నాగవల్లి శ్రీధర్, విష్ణుమూర్తి, చిలువేరు మహేశ్, మాతంగి మోహన్, శేఖర్, బండి రామచందర్, ఓంకార్, అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ పాల్గొన్నారు.