మార్కెట్ యార్డు కేంద్రంగా ఇసుక దందా
మార్కె ట్ యార్డులు కొందరు బడా లీడర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- వెనుక ఉండి నడిపిస్తున్న బడా లీడర్
- ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు
ములుగు, నవంబర్29 (నమస్తేతెలంగాణ): మార్కె ట్ యార్డులు కొందరు బడా లీడర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ధాన్యం ఆరబోసే స్థలంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. దీంతో ధాన్యం ఆరబోసుకునేందుకు స్థలం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగులోని మార్కెట్ యార్డును కేంద్రంగా చేసుకొని అధికార పార్టీకి చెందిన నామినేటెడ్ పోస్టు పొందిన ఓ బడా నాయకుడు కొంతకాలంగా ఇసుక దందాను చేస్తున్నాడు. గోదావరి నది ఇసు క ర్యాంపుల నుంచి రాత్రి వేళల్లో లారీల ద్వారా పెద్ద మొ త్తంలో ఇసుకను ములుగుకు తరలించి నిల్వ చేస్తున్నారు.
మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నట్లు రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ధాన్యం ఆరబోసుకునే స్థలంతో పాటు గోదాంల ఎదుట సీసీ రోడ్లపై పెద్ద మొత్తంలో ఇసుకను నిల్వ చేయడంతో ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ములుగు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సైతం మార్కెట్ యార్డులో అనువైన స్థలం లేక ప్రస్తుతం జాతీయ రహదారి వెంట మార్కెట్ యార్డు కార్యాలయ నిర్మాణం జరుగుతున్న కొద్ది పాటి స్థలంలో ఏర్పాటు చేశారు. స్థలం సరిపోకపోవడంతో కొందరు మెడికల్ కాలేజీ స్థలంలో వడ్లను ఆరబోసుకుంటున్నారు. దీంతో రవాణా ఖర్చులు అదనంగా రైతులపై పడుతున్నాయి.
వెనుక ఉండి నడిపిస్తున్న బడా లీడర్
ములుగు మార్కెట్ యార్డులో గత ప్రభుత్వ హయం లో కొంతమేరకు స్థలాన్ని మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానతో పాటు నర్సింగ్ కాలేజీ భవన నిర్మాణాలకు కేటాయించారు. అనుబంధ దవాఖాన నిర్మాణం ఇటీవల పూర్తయి ప్రస్తుతం అందులో మెడికల్ కాలేజీ కొనసాగుతున్నది. రెండేళ్లుగా నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న అధికార పార్టీకి చెందిన ఓ బడా నాయకుడు మార్కెట్ యార్డు స్థలంలో నిల్వ చేస్తూ విక్రయిస్తున్నాడు. అయితే ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఇబ్బందులు ఏర్పడగా, మార్కెట్ కమిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు సదరు నాయకుడి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ఇసుకను తొలగించాలని చెప్పినా, తొలగించట్లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అయినా అవేవి పట్టనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ స్పందించి మార్కెట్ యార్డులోని ఇసుక నిల్వలపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

