కరీమాబాద్, మార్చి 14 : మామునూరు ఎయిర్‌పోర్టు స్థలం గుంటూరుపల్లిలో కొందరు మట్టి కోసం అక్రమ తవ్వకాలు చేపట్టినట్లుగా స్థానికులు గుర్తించారు. ఈ మేరకు వారిని నిలదీయడంతో పాటు రెవెన్యూ అధికారులు, పోలీసులకు సమాచారం అందజేశారు.
దీంతో పోలీసులు అక్రమ తవ్వకాలను చేపట్టిన ప్రొక్లెయినర్‌ను శనివారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.. కానీ, నిందితులపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. కాగా, కొందరు అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తవ్వకాలను చేపట్టినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.