Hanmakonda | హనుమకొండ (ఐనవోలు) : అనారోగ్యంతో బాధపడుతూ ఐకేపీ కమ్యూనిటీ కోఆర్డినేటర్ మృతువ్యాత పడ్డాడు. మండలంలోని నందనం గ్రామానికి చెందిన తాడూరి ప్రశాంత్(42) ఐకేపీ డిపార్టుమెంట్లో కమ్యూనిటీ కోఆర్డినేటర్గా 20 ఏండ్లుగా సేవలందిస్తున్నారు. ఐనవోలు నూతనంగా మండలంగా ఏర్పడిన నాటి నుంచి 9 సంవత్సరాలుగా మండల కేంద్రానికి క్లస్టర్ సీసీగా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. ప్రశాంత్కు భార్య దివ్య, ఇద్దరు ఆడపిల్లలు. ఆయన మృతి పట్ల డీఆర్డీవో మేన శ్రీనివాస్, ఏపీడీ సుధీర్ కుమార్, డీపీయంలు అనిల్, దాసు, ప్రకాశ్, ఏపీయంలు కోటి, శ్రీనివాస్, వేణు, సీసీలు ఏలయ్య, మోహన్ బాబు, శంకరయ్య, కొమురయ్య, స్వామి, ధనుంజయ, వీవోలు, సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. ప్రశాంత్ మృతదేహన్ని హనుమకొండ స్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు.