వర్ధన్నపేట, జనవరి 16: కంటికి రెప్పలా కాపాడుకున్న కొడుకే కసాయిగా మారాడు. ఆస్తి కాజేసి వృద్ధుడైన తండ్రిని బయటకు గెంటేశాడు. ఈ అమానవీయ ఘటన వర్ధన్నపేట మండలంలోని దమ్మన్నపేట శివా రు దొడ్లగడ్డలో చోటుచేసుకుంది. బాధితు డు తెలిపిన వివరాల ప్రకారం.. గుజ్జుల రాజారెడ్డి(72) 33 ఏళ్ల క్రితం మైలారం గ్రామానికి చెందిన సుజాతను వివాహం చేసుకోగా, వీరికి ఒక కుమార్తెతో పాటు కొడుకు వినయ్‌రెడ్డి జన్మించారు. వివాహం జరిగిన ఐదేళ్ల తర్వాత సుజాతను ఒప్పించి ఇదే గ్రామానికి చెందిన యశోదను ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమెకు ఒక కుమార్తె జన్మించింది. ఇద్దరు భార్యలు, పిల్లలతో 25 ఏళ్లపాటు ఒకే ఇంట్లో సంతోషంగా ఉన్నారు.
ఈక్రమంలో సుజాత కుమార్తె వివాహమైన తర్వాత, తల్లి సహకారంతో కొడుకు వినయ్‌రెడ్డి తండ్రిని చంపుతానని బెదిరించి, పథకం ప్రకారం రాజారెడ్డి చిన్నభార్య, కుమార్తెకు తెలియ కుండా 15 ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడు. అనంతరం 2022 సంవత్సరంలో రాజారెడ్డి, ఆయన రెండో భార్య, కుమార్తె, తల్లి వనమ్మను ఇంటి నుంచి బయటకు వెళ్ల గొట్టాడు. రెండు నెలల క్రితం వనమ్మ మృతి చెందినా ఇంట్లోకి రానివ్వకపోవడంతో మృతదేహాన్ని ఇంటి బయటే వేసి దహన సం స్కారాలు ని ర్వహించారు. తనకు తన భార్య, కుమార్తెకు న్యా యం చేయాలని కోరుతూ గురువారం రాజారెడ్డి పో లీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అలాగే కుమారుడి భూమి రిజిస్ట్రేషన్ పట్టాను రద్దు చేయాలని కోరుతూ ఇటీవల ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసినట్లు వివరించారు.