నల్లబెల్లి, జూలై 30: ఓ దళిత ఉద్యోగిని వేధింపులకు గురవుతున్నది. తనను వేధిస్తున్న గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌పై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని రేలకుంట గ్రామ పంచాయతీలో నిబంధనల ప్రకారం ఐదుగురు మల్టీపర్పస్ వర్కర్లు పని చేయాల్సి ఉంది.
గతంలో కార్యదర్శి రామారావు, ఎంపీవో ప్రకాశ్, సర్పంచ్ తీర్మానం చేసి ఏడుగురిని నియమించారు. ప్రస్తుతం రామారావు బదిలీ కాగా, ఆయన స్థానంలో సరస్వతి వచ్చారు. ఈ నేపథ్యంలో అదనంగా ఉన్న ఇద్దరు వర్కర్లలో మిడిదొడ్డి రాజు పనులు చేయకపోవడమే కాకుండా కార్యదర్శి సరస్వతిని నిత్యం వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే వారే కరువయ్యారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సీఈవో రాంరెడ్డిని వివరణ కోరగా.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. ఆమెకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.