హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 23 : హనుమకొండ రెడ్డిపురంలోని టీవీవీ సుఖాంత్ క్రీడామైదానంలో ఈ నెల 20 నుంచి జరుగతున్న ఉమ్మడి ఆరు జిల్లాల అండర్-23 క్రికెట్ పోటీల్లో హనుమకొండ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘ బాధ్యులు టోర్నమెంట్ విజేత హనుమకొండ, రన్నర్ మహబూబాబాద్ జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హనుమకొండ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 122 పరుగు చేసింది.
మహబూబాబాద్ జట్టు 16 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి చవిచూసింది. అనంతరం వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వరంగల్ కేంద్రంగా నవంబర్లో జరిగే అండర్-23 అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి వరంగల్ జట్టును విజేతగా నిలపాలని సూచించారు. సంయుక్త కార్యదర్శి ఉపేందర్, ఈసీ బాధ్యులు తోట రాము, మట్టెడ కుమార్, మహబూబాబాద్ జిల్లా క్రికెట్ ఇన్చార్జి అజయ్ సారధి, మాజీ కార్యదర్శి ఉదయ్భానురావు, బండారి ప్రభాకర్ , వరంగల్ రంజీ ప్లేయర్ సుఖాంత్ పాల్గొన్నారు.