పోచమ్మమైదాన్, అక్టోబర్ 25 : చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పద్మశాలీలు వరంగల్ కొత్తవాడలోని గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ నాయకుడు యెలుగం సత్యనారాయణ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పోస్టుకార్డుల ఉద్యమంలో పద్మశాలీలు పాల్గొని విజయవంతం చేశారన్నారు.
చేనేత కార్మికులపై భారం పడకుండా వెంటనే కేంద్రం జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 26వ డివిజన్ కార్పొరేటర్ బాలిన సురేశ్, డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజు, నాయకులు బొల్లు సతీశ్, యెలుగం సాంబయ్య, రుద్రవీర భద్రయ్య, గోరంటాల రాజయ్య, సోమ రాము, మాటేటి కనకయ్య, ఆడెపు లచ్చులు, కూచన రమేశ్, రామకృష్ణ, గోరంటాల రాజయ్య, ఓం ప్రకాశ్ పాల్గొన్నారు.