కాలచక్రం గిర్రున తిరిగింది. కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది వచ్చేసింది. తీపి, చేదు జ్ఞాపకాలు, మరెన్నో అనుభూతులను మిగిల్చిన 2024కి వీడ్కోలు, 2025కి ఘన స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా డిసెంబర్ 31 మంగళవారం సాయంత్రం నుంచే ఉమ్మడి జిల్లా అంతటా ‘కొత్త సంబురం’ మొదలుకాగా అర్ధరాత్రి 12 గంటలకు పటాకుల మోత, కేకుల కోత,
యువత కేరింతల నడుమ ఇంటాబయటా, అలాగే సామాజిక మాధ్యమాల్లో ‘హ్యాపీ న్యూ ఇయర్’ శుభాకాంక్షల మోత మోగింది. దీంతో వరంగల్ నగరం సహా పట్టణాల్లోని బేకరీలు, స్వీట్ దుకాణాలు, వైన్‌షాపులు కిటకిటలాడగా చిన్నాపెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్