బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును బుధవారం బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఘనంగా జరుపుకొన్నారు. రామన్నపై ప్రేమతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేక్ కటింగ్‌లు, ఆలయాల్లో పూజలు, రక్తదానాలు, దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు, చిరువ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. అలాగే మొక్కలు నాటి ‘లాంగ్ లివ్.. కేటీఆర్ సార్ హ్యాపీ బర్త్‌డే’ అంటూ పెద్ద పెట్టున నినాదాలతో శుభాకాంక్షలు తెలిపారు.

16
జనగామలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాల్గొని ఆడబిడ్డలకు వెయ్యి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేయడంతో పాటు రక్తదానం చేసి, వీధి వ్యా పారులకు గొడుగులు పంపిణీ చేశారు. అలాగే ములుగులో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, బయ్యారంలో జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు పాల్గొనగా పలువురు నేతలు హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి బర్త్‌డే విషెస్ చెప్పారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 24