ఏటూరునాగారం, డిసెంబర్ 9 : పేదరికంలో పుట్టినా తమ ఆలోచనలతో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇద్దరు విద్యార్థినులు. పలు పరికరాల త యారీలో ప్రతిభ కనబర్చి ప్రముఖుల ప్రశంసలందుకుంటున్నారు. తాజాగా రాష్ట్ర, సౌత్ ఇండియా స్థాయి సైన్స్ ఫేర్లలో వారు రూపకల్పన చేసి ప్రదర్శించిన ఎగ్జిబిట్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాటు రాష్ట్రపతిని కలుసుకునే అవకాశా న్ని అందిపుచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ము లుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడేనికి చెందిన గార రక్షిత, గార మైథిలి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా రు.
చిన్నప్పటి నుంచే పలు పరికరాలు తయారు చే సే వీరు తాజాగా ‘ఇంటెలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికిల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్’ అనే ఎగ్జిబిట్‌ను రూపొందించారు. గత ఏడాది డిసెంబర్లో నిర్మల్ జరిగిన రాష్ట్ర స్థాయి, జనవరి 27 నుంచి 31 వరకు విజయవాడలో జరిగిన సౌత్ ఇండియా (ఆరు రా ష్ర్టాల స్థాయి) సైన్స్ ఫేర్‌లో ఈ ఎగ్జిబిట్‌ను ప్రదర్శిం చి తమ ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నారు.
దీం తో నిర్వాహకులు హర్యానాలో ఈ నెల 25 నుంచి 31 వరకు జరిగే జాతీయస్థాయి సైన్స్ ఫేర్‌కు వీరిని ఎంపిక చేశారు. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి 30 ప్రాజెక్టులను పంపించగా రెండు ఎగ్జిబిట్లు మా త్రమే ఎంపికయ్యాయి. అందులో రక్షిత, మైథిలి రూపొందించిన పరికరం ఒకటి. వీరు తయారు చే సిన పరికరాన్ని వాహనాలకు బిగించి శాటిలైట్‌కు అనుసంధానం చేయడం వల్ల డ్రైవర్లు మద్యం సే వించినప్పుడు ఇంజిన్ ఆన్ కాకుండా ఉంటుంది.
అంతే కాకుండా వారు మద్యం సేవించిన సమాచారాన్ని స్థానిక పోలీసులతో పాటు వారి తల్లిదండ్రు లు, కుటుంబీకులకు పంపిస్తుంది. దీంతో వారు అ లర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాగా, ఇద్దరు వి ద్యార్థినులు నిరుపేద కుటుంబానికి చెందిన వారని వారి గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి సోమవారం తెలిపారు. జాతీ య స్థాయి సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న అనంతరం జనవరి 2న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతిని కలువనున్నారని, ఈ మేరకు వారికి ఆహ్వానం అందినట్లు ఆయన పేర్కొన్నారు.
రక్షిత, మైథిలిని సోమవారం స్థానిక ఎస్సై తాజుద్దీన్ సన్మానించారు. హర్యానా వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని మండల కేంద్రానికి చెం దిన డాక్టర్ వరప్రసాద్‌రావుతో పాటు మరో ఇద్దరు అందిస్తున్నట్లు పాఠశాల ఉపాధ్యాయుడు కోడి వెంకటేశ్వర్లు తెలిపారు. ఎవరైనా దాతలు సహకరించి ఆదుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.