కరీమాబాద్, డిసెంబర్ 13: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం పెరుకవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల ఎల్వోసీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివనగర్‌కు చెందిన లింగమూర్తి-వరలక్ష్మి కూతురు కాత్యాయని లుకేమియాతో బాధపడుతున్నదని, వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోడంతో వెంటనే రూ. 50 వేలు అందజేశానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి కేటీఆర్ చొరవతో రూ. 5 లక్షల ఎల్వోసీ విడుదల చేశారన్నారు. యశోద వైద్యశాల యాజమాన్యంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. కార్యక్రమంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ధ్యేయం..
గ్రేటర్ వరంగల్ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నూతన కూరగాయాల మార్కెట్ నిర్మించిందని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. లక్ష్మీపురంలోని నూతన కూరగాయల మార్కెట్లో నిర్వహించిన హోమం, ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు చింతాకుల అనిల్, దిడ్డి కుమారస్వామి, ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్, పల్లం రవి తదితరులు ఉన్నారు. చిరువ్యాపారులు తమకు ప్లాట్స్ కేటాయించాలని కోరగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆదిదేవుని ఆశీర్వాదంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. శివనగర్ గణపతినగర్‌లో సిద్ధి బుద్ధి సమేత లక్ష్మీగణపతి విగ్రహ ప్రతిష్ఠాపన కన్నుల పండువలా జరిగింది. వేడుకులకు ఎమ్మెల్యే హాజరై స్థానిక భక్తులతో కలిసి పూజలు చేశారు. 34, 35 డివిజన్ల కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, సోమిశెట్టి ప్రవీణ్, మాజీ డిప్యూటీ మేయర్ కక్కె సారయ్య పాల్గొన్నారు. వరంగల్ గిర్మాజీపేట రేణుకాఎల్లమ్మ ఆలయంలో ఎమ్మెల్యే నరేందర్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ట్రస్టు ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం నవశక్తి యూత్ అసోసియేషన్ ప్రతినిధులు సత్కరించి, రేణుకాఎల్లమ్మ చిత్రపటం అందజేశారు. కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ బాలిన సురేశ్ తదితరులు పాల్గొన్నారు.