గిర్మాజీపేట/పోచమ్మమైదాన్, డిసెంబర్ 25: మణికంఠ భక్త మండలి ఆధ్వర్యంలో వరంగల్ దుర్గేశ్వరస్వామి దేవాలయ ఆవరణలో గురుస్వామి రవ్వ సతీశ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు 31వ మహాపడిపూజను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం నిర్వహించి భజనలు, పడిపూజ, 108 కళశాలు, పంచామృతాలతో టక్కర్సు సత్యంశర్మ పర్యవేక్షణలో అయ్యప్పస్వామి అభిషేకం చేశారు. అనంతరం స్వాములు, భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ దంపతులు, జూలూరు గంగాధర్, ఎం కమలాకర్, లింగేశ్వర్, దివ్వెల పూర్ణ, కృష్ణమోహన్, రవి, సంజీవ్ పాల్గొన్నారు. కాశీబుగ్గలోని మణికంఠకాలనీలో ఉన్న సర్వరక్షక అయ్యప్పస్వామి ఆలయంలో మహాపూడిపూజ నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దుజు కర్ణానందం, లీలాదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేతిరి రాజశేఖర్-లావణ్య దంపRava Satishతులు, గురుస్వామి సిద్దోజు కృష్ణమూర్తి బృందం, చంద్రశేఖర్, నల్ల వెంకన్న, రమేశ్, కార్తీక్, సమ్మక్క, రాజేందర్, సంతోష్‌కుమార్, వంశీకృష్ణ, కరుణాకర్, కీర్తిచంద్ర, రామకృష్ణ, సాయిలు, రాజేశ్ పాల్గొన్నారు.
శబరియాత్రకు పయనం
రాయపర్తి: మండలంలోని మొరిపిరాలకు చెందిన అయ్యప్ప మాలధారుల బృందం ఆదివారం మణికంఠస్వామి దర్శనం కోసం శబరియాత్రకు బయల్దేరింది. మండల దీక్షకు చేరువైన గ్రామంలోని పలువురు అయ్యప్పలు స్థానిక ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేక పూజల అనంతరం గురుస్వామి సోమన్న సమక్షంలో ఇరుముడులు కట్టుకొని శబరియాత్రకు తరలివెళ్లారు. శబరికి వెళ్లిన వారిలో ఓరుగంటి వెంకన్న, చేగూరి మల్లేశ్, గుత్తి మల్లేశం, బోరిగం భాస్కర్, చిలువేరి సాయిగౌడ్, గోరుగంటి అఖిల్, సాయికిరణ్ ఉన్నారు.